ఈ దసరా కి రెండు పెద్ద సినిమాలతో పాటు స్వాతి ముత్యం అనే ఓ చిన్న సినిమా రిలీజవుతుంది. ఇటు చిరు గాడ్ ఫాదర్ అటు నాగార్జున ది ఘోస్ట్ విజయదసమి రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఇప్పుడు థియేటర్స్ చిక్కు వచ్చి పడిందట. రెండు పెద్ద సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేయడం డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాలకు నైజాం లో పెద్ద సమస్య ఉందట.
దానికి కారణం నాగార్జున సినిమా నిర్మాత ఎశియన్ సునీల్. నైజాంలో ఎశియన్ వాళ్లకి అధిక థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళ బేనర్ లో తెరకెక్కిన సినిమా ది ఘోస్ట్ కి ఆ థియేటర్స్ కేటాయించుకుంటున్నారు. దీంతో చిరు గాడ్ ఫాదర్ కి తెలంగాణాలో ఆశించిన థియేటర్స్ దక్కడం లేదని మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు. మెగా స్టార్ కి నైజాంలో భారీ థియేటర్స్ దక్కాలని వారు డిమాండ్ చేస్తూ నిర్మాతల మీద డిస్ట్రిబ్యూటర్స్ మీద ఒత్తిడి తెస్తున్నారట.
చిన్న సినిమానే కానీ స్వాతి ముత్యం కి కూడా నైజాంలో మంచి థియేటర్స్ పడనున్నాయి. ఎందుకంటే సినిమా నిర్మాత నాగ వంశీ బడా ప్రొడ్యూసర్. పైగా ఈ సినిమాకు దిల్ రాజు సపోర్ట్ ఉంది. పెద్ద సినిమాలు నిర్మిస్తున్న బడా నిర్మాత సంస్థ నుండి వస్తున్న సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్వాతి ముత్యం కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదేమైనా ఇటు చిరు అటు నాగ్ మధ్యలో స్వాతి ముత్యంకు థియేటర్స్ కేటాయించడం డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద సవాల్ గా మారింది. ఈ రెండు సినిమాలు పోటా పోటీ మీద ఎంత వసూళ్ళు చేస్తాయి ? ముఖ్యంగా నైజాంలో చిరు ది పై చేయి గా ఉంటుందా ? లేదా నాగ్ చిరు మీద పై చేయి సాదిస్తాడా ? అనేది ఆసక్తిగా మారింది. రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది. మరి
This post was last modified on October 1, 2022 10:07 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…