పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు టెన్షన్ తగ్గించేశారు. అక్టోబర్ మూడో వారంలో స్టార్ట్ చేయబోతున్న కొత్త షెడ్యూల్ కు సంబంధించి ఒక వర్క్ షాప్ పెట్టి దాని తాలూకు వీడియోని సోషల్ మీడియాలో కూడా చేశారు. మంచి అవుట్ ఫిట్ తో చాలా గ్లామరస్ గా కనిపిస్తున్న పవన్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సో ఇది మొదలైతే నాన్ స్టాప్ గా పూర్తయ్యేవరకు కొనసాగనుంది. ఆ మేరకు దర్శకుడు క్రిష్ పక్కా ప్లానింగ్ రెడీ చేసుకున్నారు.
ఈ వర్క్ షాప్ లో యూనిట్ సభ్యులతో పాటు కొందరు యాక్టర్లు కూడా పాల్గొనడం విశేషం. రఘుబాబు, సుబ్బరాజు తదితరులు ఇందులో కనిపించారు. సంభాషణలు, వాటిని డెలివరీ చేయడం గురించి కొన్ని కీలకమైన ఇన్ ఫుట్స్ ని ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ మీటింగ్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి భాగం పంచుకోవడం విశేషం. 2023 వేసవిని టార్గెట్ చేసుకున్న హరిహర వీరమల్లు ఖఛ్చితమైన విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ మధ్య ఏదో ఫంక్షన్ లో నిర్మాత ఏఎం రత్నం క్యాజువల్ గా మార్చి 30 అన్నారు కానీ ఎలా చూసినా అది మీట్ కావడం కష్టమే.
గాంధీ జయంతి సందర్భంగా ప్లాన్ చేసుకున్న పవన్ పాదయాత్ర వాయిదా వేసుకోవడం వీరమల్లుకి కలిసి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరమయ్యే ఇలాంటి గ్రాండియర్స్ కి వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయడం చాలా అవసరం. అందుకే ఇప్పుడు ఆఘమేఘాల మీద షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇదయ్యాక వినోదయ సితం రీమేక్, సుజిత్ తో అనుకున్న మూవీ, సురేందర్ రెడ్డికి ఇచ్చిన కమిట్ మెంట్ నెరవేరుస్తారా లేదా చూడాలి. వీటి సంగతేమో కానీ అన్నిటికన్నా ముందు వరుసలో ఉన్న భవదీయుడు భగత్ సింగ్ ఒక్కటి చేసి నెక్స్ట్ జనసేనతో బిజీ కావాలని అభిమానుల ఆకాంక్ష. మరి పవన్ మనసులో ఏముందో
This post was last modified on September 30, 2022 7:38 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…