‘ఆదిపురుష్’ సినిమాను అనౌన్స్ చేసి రెండేళ్లు దాటింది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయి కూడా ఏడాది దాటిపోయింది. కానీ అభిమానులు సుదీర్ఘ కాలం నిరీక్షింపజేసి ఎట్టకేలకు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశాడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఓం రౌత్. అది చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ బాగుందని అంటున్నవాళ్లు చాలా తక్కువ మంది. ప్రభాస్ అభిమానులు సైతం లుక్ విషయంలో నిరాశనే వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం ఎదురు చూసింది దీని కోసమా అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో.
‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన లుక్‌కు ఈ లుక్ చాలా దగ్గరగా ఉండడం.. పైగా అదే చాలా స్ట్రైకింగ్‌గా అనిపించి ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ సాధారణంగా అనిపిస్తుండడం ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు ఒక కారణం. దాంతో పోలిక పక్కన పెట్టి చూసినా ప్రభాస్ లుక్ గొప్పగా అయితే లేదు.
ఉత్తరాది ప్రేక్షకులు ‘ఆదిపురుష్’ విషయంలో కొంచెం తీవ్ర స్వరంతోనే స్పందిస్తున్నారు. ప్రభాస్ రాముడి పాత్ర చేయడానికి తగ్గట్లు ఫిట్‌గా కనిపించడం లేదని.. భారీ అవతారంలో ఇబ్బందికరంగా అనిపిస్తున్నాడని.. ఇక రాముడి పాత్ర చేస్తూ మీసం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నోసార్లు లుక్ టెస్ట్ చేసి, ఎంతో కసరత్తు చేశాక రాముడిగా ప్రభాస్ లుక్ ఫైనలైజ్ చేశామని దర్శకుడు ఓం రౌత్ చెప్పగా.. నిజంగా అంత కసరత్తు జరిగిందా అని ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు చాలామంది.
ఐతే ఇప్పుడు రిలీజ్ చేసింది సైడ్ లుక్, పైగా ‘ఆర్ఆర్ఆర్’తో పోలిక ఉండడం వల్ల కూడా నెగెటివ్ రెస్పాన్స్ వస్తోందని.. తర్వాత ఫుల్ లెంగ్త్ లుక్ రిలీజైతే, టీజర్ వస్తే ప్రేక్షకుల ఆలోచన మారుతుందని కొందరంటున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్ వరకు అయితే మెజారిటీ నెగెటివ్ రెస్పాన్సే వచ్చిన నేపథ్యంలో అక్టోబరు 2న రిలీజయ్యే టీజర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటే తప్ప నెగెటివిటీ తగ్గడం కష్టం అన్నమాటే.
This post was last modified on September 30, 2022 2:23 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…