మనమే గొప్ప.. మనదే గొప్ప అనే ఫీలింగ్ ఉండడం ప్లస్సా మైనస్సా అని చెప్పడం కష్టమే. తెలుగు వాళ్లకు స్వాభిమానం అస్సలు ఉండదని.. భాష, సంస్కృతి, సినిమా.. ఇలా చాలా విషయాల్లో మన గొప్పదనాన్ని మనం గుర్తించమని.. మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం అనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఐతే తమిళులు దీనికి పూర్తి భిన్నం. చాలా విషయాల్లో తమను మించిన వారు లేరు అనే ఫీలింగ్ వారిలో ఉంటుంది. కానీ ఉన్న గొప్పదనాన్ని చూపించుకుంటే ఓకే కానీ.. లేనిది ఆపాదించుకోవడం వల్ల జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ.
సినిమాల విషయంలో ఈ మధ్య తమిళుల తీరు ఇలాగే ఉంటోంది. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసిన తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు క్వాలిటీ బాగా పడిపోయింది. క్రిటిక్స్ దగ్గర్నుంచి ఆడియన్స్ వరకు పనికిరాని సినిమాలను కూడా గొప్పగా నెత్తిన పెట్టుకోవడం అక్కడ చూస్తున్నాం. ‘అన్నాత్తె’ లాంటి నాసిరకం సినిమా కూడా అక్కడ బాగానే ఆడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా విషయంలో తమిళ క్రిటిక్స్, ప్రేక్షకుల స్పందన చూసినా ఆశ్చర్యం కలగకమానదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇలాంటి సినిమా రాలేదంటూ, ఇదొక అద్భుతం అంటూ ఈ రోజు తెల్లవారుజామున షోలు పడ్డప్పటి నుంచి వాళ్లకు వాళ్లు కీర్తించేసుకుంటున్నారు. క్రిటిక్స్ రేటింగ్స్ అయితే 3.5 నుంచి మొదలయ్యాయి. 4.5 రేటింగ్స్ కూడా చాలామంది ఇచ్చేశారు. అంత గొప్పగా ఉందా అని ఉదయం తెలుగు వెర్షన్ చూసిన మన ప్రేక్షకులు, క్రిటిక్స్‌కు దిమ్మదిరిగిపోయింది.
ట్రైలర్ చూసి తక్కువ అంచనాలు పెట్టుకుని సినిమాకు వెళ్లిన వాళ్లకు కూడా నిరాశ, నీరసం తప్పలేదు. ఏవో కొన్ని ఎపిసోడ్లు, మూమెంట్స్, సాంకేతిక హంగులు తప్పితే సినిమాలో దమ్ము లేదన్నది స్పష్టం. చివరి వరకు కూర్చోవడం కష్టమయ్యే స్థాయిలో సహనానికి పరీక్ష పెట్టింది ‘పొన్నియన్ సెల్వన్’. దీంతో పోలిస్తే ఎన్నో రెట్లు గొప్పగా ఉండి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ విషయంలో మన క్రిటిక్స్, ప్రేక్షకులు ఒకప్పుడు స్పందించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ‘బాహుబలి-1’ రిలీజైనపుడు మన వాళ్లే సినిమా అంత గొప్పగా లేదని అన్నారు. రేటింగ్స్ కూడా ఒక మోస్తరు స్థాయిలోనే వచ్చాయి. అలా మనం క్రిటికల్‌గా చూసి మన గొప్పదనాన్ని మనం తగ్గించుకున్నాం. కానీ ప్రపంచం దేశమంతా సినిమాను కొనియాడింది. కానీ తమిళులు మాత్రం ఒక భ్రమలో బతుకుతూ ‘పొన్నియన్ సెల్వన్’కు లేని గొప్పదనాన్ని ఆపాదిస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on September 30, 2022 2:14 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…