రెబెల్ స్టార్ కృష్ణంరాజు సంతాపసభను పురస్కరించుకుని.. మొగల్తూరులో ప్రభాస్ ఓ రేంజు లంచ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ లంచ్ లో పెట్టిన రకరకాలు డిష్ లు, వాటి రేట్లు ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయ్. సరే మన ప్రభాస్ రేంజి అది అని చాలామంది ఎంజాయ్ చేస్తుంటే, కొంతమంది ట్రోలర్లు మాత్రం దీన్నో ఫ్యాన్ వార్ గా మార్చేశారు. ఏకంగా ఇప్పుడు అది మెగా వర్సెస్ నందమూరి వార్ అన్నట్లు తయారైంది.
ప్రభాస్ అంతటి రిచ్ భోజనం పెట్టాడు సరే.. వేల కోట్లు సంపాదించుకున్న మీ హీరో కనీసం కాఫీ నీళ్ళు కూడా పొయ్యలేందంటూ ఒక వర్గం కామెంట్ చెయ్యగా.. మరి మీ హీరో ఏం చేశాడు అంటూ మరో వర్గం బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. అంతటితో ఆగకుండా.. కొన్ని మార్ఫింగ్ ఫోటోలు తయారుచేసి.. ఎప్పుడో చిరంజీవి లంచ్ చేస్తున్న పిక్ ఒకటి బయటకు తీసి.. అన్నేసి డిష్ లు వండారని తెలిసి ఆపుకోలేక చిరంజీవి లంచ్ కి వెళ్ళిపోయారంటూ కొంతమంది కామెంట్లు చేశారు. దీనికి మరో వర్గం అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా భోజనం చేసి క్యారేజ్ కూడా పట్టుకెళ్ళాడని కామెంట్లు చేస్తున్నారు.
ట్రోలింగ్ అనేది కాస్త పాజిటివ్ గా ఉంటే ఓకే కాని, మరీ ఈ లెవెల్లో ఉంటే చూసేవారికి చదివేవారికి కూడా ఏహ్యంగా అనిపిస్తుంది. ఒక హీరోకు వీరాభిమానులు అయినంత మాత్రాన మరో హీరోను కించపరచాల్సిన అవసరమేలేదు. మా హీరో సినిమా వందరోజులు ఆడింది, మా హీరో పలానా రికార్డులు కొట్టాడు అంటూ ఫ్యాన్స్ చెబుతుంటే ఒకప్పుడు సదరు హీరో మీద వాళ్ళ గుండెల్లో ఉన్న ప్రేమే కనిపించేది. కాని ఇప్పుడు పక్క హీరోలను ట్రోల్ చేస్తుంటే మాత్రం.. వీళ్ళ హార్టులో ఇంతటి నెగెటివిటీ ఉందా అనిపిస్తోంది.
This post was last modified on September 30, 2022 12:12 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…