వంద కోట్ల బిజినెస్ చేసే సత్తా ఉన్న పెద్ద స్టార్లు మనకు అరడజను మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళలో అందరి సినిమాలు ఏడాదికి ఒకటి వస్తే ట్రేడ్ ఖుషీగా ఉంటుంది. చిన్న సినిమాలు ఎన్ని సక్సెస్ అయినా రాని కిక్కు ఒక పెద్ద సినిమా క్లిక్ అయితే వస్తుంది. మన వంద కోట్ల హీరోల్లో ఒకడైన ప్రభాస్ మాత్రం బాహుబలితో స్లో అయిపోయాడు. బాహుబలికి ముందు పన్నెండేళ్లలో పదహారు సినిమాలు చేసిన ప్రభాస్ గత ఏడేళ్లలో కేవలం మూడే సినిమాలు చేసాడు.
ఈ ఏడాదిలో కూడా ప్రభాస్ సినిమా రాదని తేలిపోయింది. వచ్చే వేసవికి రాధేశ్యామ్ రిలీజ్ అయితే… నాగ్ అశ్విన్ తీసే భారీ చిత్రానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుంది. అంటే ప్రభాస్ సినిమా ఏడాదికి ఒకటి రావడం పోయి… రెండేళ్లకు ఒకటి వస్తే గొప్ప అన్నట్టయింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడని అభిమానులు ఎంత ఆనందపడినా కానీ, ప్రభాస్ సినిమా అప్డేట్స్ కోసం కూడా మొహం వాచేలా ఎదురు చూడాల్సి వస్తోంది.
టాలీవుడ్ ట్రేడ్ కూడా ప్రభాస్ ని బాగా మిస్ అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇలా అయినట్టు, రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. తర్వాత ఎన్టీఆర్, చరణ్ కూడా ఇంత సెలెక్టివ్ అయిపోకుండా వుంటే చాలని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on July 8, 2020 7:14 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద…
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ…
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…