ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చినా సత్యదేవ్ లోని అసలైన నటుడు బయటికి వచ్చింది మాత్రం బ్లఫ్ మాస్టర్ తోనే. అదేమీ బ్లాక్ బస్టర్ కాదు కానీ దానికి పెట్టిన బడ్జెట్ కి, రీమేక్ హక్కులకు సరిపడా గిట్టుబాటు చేసుకుంది. అయితే ఆ తర్వాత చేసినవి ఈ విలక్షణ నటుడికి అంతగా అచ్చి రాలేదు. ఒకవైపు తమన్నాతో జంట కట్టిన గుర్తుందా శీతాకాలం విడుదల కోసం నానా కష్టాలు పడుతోంది. డేట్లు మారుతున్నాయి తప్ప థియేటర్లలో ఎప్పుడు వస్తుందో తనకూ తెలియదు. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు గోపి గణేష్ తో ఆ మధ్య చేసిన గాడ్సే డిజాస్టర్ ఇచ్చిన షాక్ అలాంటిది. కృష్ణమ్మ సైతం తేదీ కోసం ఎదురు చూస్తోంది
ఇప్పుడు సత్యదేవ్ కు ఒకే నెలలో రెండు కీలక పరీక్షలు ఎదురు కాబోతున్నాయి. మొదటిది అక్టోబర్ 5న రానున్న గాడ్ ఫాదర్. నెగటివ్ షేడ్స్ లో చిరంజీవిని ఢీ కొట్టే ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇది. నయనతార భర్తనే పేరే కానీ మంచి విలనిజం ఉంటుంది ఈ పాత్రలో. కొన్ని సీన్లలో మెగాస్టార్ నే ఎదిరించే డైలాగులకు చాలా పేరొస్తుందని ఇప్పటికే టాక్ ఉంది. ఇది క్లిక్ అయితే హిందీలోనూ గుర్తింపు వస్తుంది. సల్మాన్ ఖాన్ క్యామియో చేసినందుకు బాలీవుడ్ లోనూ భారీ ఎత్తున పబ్లిసిటీతో ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి హిట్ కొడితే ఆటోమేటిక్ గా అవకాశాలు పెరుగుతాయి.
రెండోది రామ్ సేతు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ విజువల్ ఫాంటసీ అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. విజువల్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో అయోధ్య రాముడి సెంటిమెంట్ ని టచ్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఎప్పుడూ అక్షయ్ వెన్నంటే ఉండే ఓ ముఖ్యమైన పాత్రను సత్యదేవ్ కి ఇచ్చారు. కార్తికేయ 2 తరహాలో దీనికి మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది. ఒకే దెబ్బకు డబుల్ పిట్టలన్నట్టు గాడ్ ఫాదర్, రామ్ సేతులు సక్సెస్ అయితే తెలుగు హిందీలో సత్యదేవ్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. వేచి చూడాలి మరి.
This post was last modified on September 27, 2022 9:02 am
హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…