కోలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా మాత్రమే కాకుండా కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న విక్రమ్ వేదా అయిదేళ్ల తర్వాత ఇంకో భాషలో రీమేక్ కావడం హిందీలోనే జరిగింది. హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ లాంటి క్రేజీ కాంబోతో ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన గాయత్రి పుష్కర్ లే దీనికీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రమోషన్ విషయంలో నిర్మాణ సంస్థ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ చేసిన రెండు పాటలకు ఏమంత రెస్పాన్స్ రాలేదు. ఆల్కోహోలియా సాంగ్ కు హంగామా చేశారు కానీ అది కూడా సోసోగానే వెళ్తోంది.
ఇంకో మూడే రోజుల్లో థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ ఇంటెన్స్ డ్రామాకు ముందు 25 కోట్ల దాకా ఫస్ట్ డే ఓపెనింగ్ ట్రేడ్ అంచనా వేసింది. కానీ క్రమంగా బజ్ తగ్గుతూ పోవడంతో 15 కోట్లకు మించి రాకపోవచ్చని ఆందోళన చెందుతున్నారు. బ్రహ్మాస్త్ర తరహాలో అగ్రెసివ్ ప్రమోషన్ చేయకపోవడమే దీనికి కారణమని వాళ్ళ ఆరోపణ. హృతిక్ తో సహా టీమ్ ముంబై దాటి బయటికి రావడం లేదని, హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించినా అవి మీడియాలో హైలైట్ అవ్వకపోవడానికి ప్రొడక్షన్ హౌస్ నిర్లక్ష్య వైఖరేనని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
వాళ్ళన్న దాంట్లో పాయింట్ ఉంది. బ్రహ్మాస్త్ర వల్ల బాలీవుడ్ బాక్సాఫీసు కు ఊపొచ్చింది. తిరిగి జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ వచ్చేదాకా మధ్యలో గ్యాప్ ని ఫిల్ చేయాల్సింది విక్రమ్ వేదా లాంటి భారీ బడ్జెట్ మూవీసే. చూస్తేనేమో పరిస్థితి ఇలా ఉంది. అసలే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1, ధనుష్ నేనే వస్తున్నాలతో సౌత్ కలెక్షన్లకు గండి పడుతుందని టెన్షన్ పడుతున్నతరుణంలో కేవలం ఉత్తరాది మార్కెట్ నే నమ్ముకుంటే కష్టమని అంటున్నారు. మాధవన్ విజయ్ సేతుపతి రేంజ్ ఇంటెన్సిటీని హృతిక్ సైఫ్ లు తిరిగి పండిస్తారా అనే అనుమానాలు ఆల్రెడీ ఉండగా ఇప్పుడీ పరిణామాలు మరింత చికాకు పెట్టేవే.
This post was last modified on September 26, 2022 7:51 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…