Movie News

NBK 107 విడుదల తేదీ ఖరారు ?

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇస్తాన్ బుల్ లో విలన్ గా నటిస్తున్న దునియా విజయ్ తో పాటు కీలక తారాగణం పాల్గొనగా యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. విడుదల తేదీ విషయంలో అభిమానులలో నెలకొన్న సందిగ్దతకు ఈ దసరా పండగ చెక్ పెట్టే అవకాశాలున్నాయి. బ్యానర్ వ్యవహారాల గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు చిరంజీవి వాల్తేర్ వీరయ్య(టైటిల్ ప్రకటించలేదు) తో 2023 సంక్రాంతి బరిలో ఈ సినిమా పోటీ పడుతుందని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.

అయితే ఆ అవకాశం ఎంత మాత్రం లేదు. రెండు సినిమాల నిర్మాణ సంస్థ ఒకటే అయినప్పుడు ఎంత అనివార్యమైనా సరే అలాంటి రిస్క్ చేయరు. అందులోనూ చిరు బాలయ్య లాంటి సీనియర్లతో. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ NBK 107ని డిసెంబర్ 23 రిలీజ్ చేయడం దాదాపు ఖరారేనట. బాలకృష్ణ అంతా సరిచూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే విజయదశమి రోజు అఫీషియల్ గా ప్రకటిస్తారు. నిజానికి ఆ డేట్ కి విజయ్ దేవరకొండ ఖుషీ రావాలి. కానీ అది ఆల్రెడీ వాయిదా పడింది. అఖిల్ ఏజెంట్ అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.

సో బాలయ్య సోలో అడ్వాంటేజ్ తీసుకుని బరిలో దిగే అవకాశం ఉంది. అదే సమయంలో రణ్వీర్ సింగ్ సర్కస్, లారెన్స్ రుద్రుడులు ఉన్నాయి కానీ వాటిని పోటీగా పరిగణించాల్సిన అవసరం లేదు. టైటిల్ గా ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి కానీ యూనిట్ ఏదీ లీక్ చేయడం లేదు. జై బాలయ్య, అన్నగారు, రెడ్డిగారు అని రకరకాల పేర్లు ఫ్యాన్స్ మధ్య తిరగడమే తప్ప ఫైనల్ గా ఏది లాక్ చేస్తారో ప్రస్తుతానికి సస్పెన్సే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో మరి .

This post was last modified on September 26, 2022 7:17 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago