సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గొప్ప నటుల్లో విక్రమ్ ఒకడు. ఐతే కేవలం నటనలోనే కాదు.. మన చరిత్ర మీద పరిజ్ఞానంలోనూ అతను వన్ ఆఫ్ ద బెస్ట్ అనే విషయం రుజువైంది. మనం తక్కువ చేసుకునే మన చరిత్ర గురించి పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రెస్ మీట్లో విక్రమ్ చెప్పిన మాటలు చూసిన ఎవ్వరైనా ఫిదా అవ్వకుండా ఉండలేరు. నిన్నట్నుంచి ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ విక్రమ్ ఈ వీడియోలో ఏమన్నాడంటే..
‘‘ప్యారిస్ లోని లీనింగ్ టవర్ ఆఫ్ పీసా నిర్మాణంలో లోపం వల్ల బలంగా నిలబడలేక పక్కకు ఒరిగింది. కానీ అది మనకు గొప్పగా అనిపిస్తుంది. దాని ముందు నిలబడి ఫొటోలు దిగుతాం. కానీ మన దగ్గర వేల ఏళ్ల నాటి నిర్మాణాలు ఇప్పటికీ దృఢంగా ఉన్నా వాటి గొప్పదనం మనకు అర్థం కాదు. కనీసం గోడలకు ప్లాస్టింగ్ కూడా చేయకుండానే అవి వేల ఏళ్లు చెక్కు చెదరకుండ ఉండేలా వాటి నిర్మాణం చేపట్టారు మన పూర్వీకులు. ఎన్నో భూకంపాలను తట్టుకుని నిలబడ్డ ఆలయాలు, కోటలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. చోళ రాజులు అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. ఐదో శతాబ్దంలో అంత అద్భుతమైన నిర్మాణాలు ఎలా చేశారో అర్థం కాదు. ఆ రోజుల్లోనే మన దగ్గర గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నో నిర్మాణాలకు మహిళల పేర్లు పెట్టారు. ఆ రోజుల్లోనే మనకు అంత గొప్ప నాగరికత ఉంది.
ఇప్పుడు ఎంతో నాగరికమైన దేశంగా చెప్పుకునే అమెరికాను కొలంబస్ కనిపెట్టడానికి 500 ఏళ్ల ముందే మన దగ్గర గొప్ప నాగరికత, సంస్కృతి ఉన్నాయి. దాన్ని చూసి మనమంతా గర్వపడాలి. మన చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ తేడాలు చూపించకూడదు. మనందరం ఇండియన్స్. మన చరిత్రను చూసి మనందరం గర్వించాలి. ఆ చరిత్రను అందరూ తెలుసుకోవాలి’’ అంటూ చోళరాజుల గురించి తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ను అందరూ ఆదరించాలని పిలుపునిచ్చాడు విక్రమ్. ఏదో సినిమా కోసమని కాకుండా మన హిస్టరీ గురించి చాలా నిజాయితీగా, గొప్పగా చెప్పిన విక్రమ్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on September 25, 2022 4:31 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…