Movie News

హాలిడే వసూళ్లకు మ్యాచ్ దెబ్బ

సీజన్ ఏదైనా సినిమాలకు వీకెండ్ కలెక్షన్లు చాలా కీలకం. ముఖ్యంగా యావరేజ్ టాక్ వచ్చినవి అంతో ఇంతో గట్టేక్కేది ఈ టైంలోనే. అయితే ఆదివారం రెవిన్యూకు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పెద్ద దెబ్బే వేయనుంది. మొదటి రెండు ఆటల్లో చెరొకటి గెలవడం వల్ల హైదరాబాద్ లో జరిగేది ఫైనల్ తరహాలో సిరీస్ విన్నర్ తేల్చేది కావడంతో క్రికెట్ అభిమానుల ఉత్సాహం మాములుగా లేదు. రెండు రోజుల క్రితం కేవలం టికెట్లు కొనేందుకే స్టేడియం వద్ద ఫ్యాన్స్ కిలోమీటర్ల కొద్దీ బారులు తీరడం, పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం లాంటి సంఘటనలు న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం.

అక్కడే ఇలా ఉంటే ఇక టీవీలో ఓటిటిలో ఎన్ని కోట్ల మంది చూస్తారో వేరే చెప్పాలా. మొన్న రెండో ట్వంటీ ట్వంటీలో రోహిత్ శర్మ బాదుతున్న టైంలో హాట్ స్టార్ వ్యూయర్ షిప్ ఏకంగా కోటికి టచ్ చేయడం బట్టే చెప్పొచ్చు జనాల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో. ఇప్పుడిది నేరుగా కీలకమైన ఈవెనింగ్ షోల మీద దెబ్బ కొడుతుంది. ఎందుకంటే మ్యాచ్ మొదలయ్యేది ఏడు గంటల తర్వాత. ముగిసేలోపు పదకొండు దాటేస్తుంది. అంటే ఫస్ట్ షో సెకండ్ షో రెండింట్లో ఏదో ఒకటి చూసే ఛాన్స్ కూడా ఉండదు. శుభ్రంగా ఇంట్లో అతుక్కుపోవడం తప్ప.

మొన్న విడుదలైన కృష్ణ వృంద విహారికి పర్లేదనే మాట వినిపిస్తోంది కానీ దాని ఆశలన్నీ సండే మీదే ఉండేవి. ఎందుకంటే రాబోయే వారం పొన్నియన్ సెల్వన్ 1, నేనే వస్తున్నా, విక్రమ్ వేదాలు ఉన్నాయి కాబట్టి ఆలోగానే వీలైనంత రాబట్టుకోవాలి. అల్లూరి సైతం హాలిడేని క్యాష్ చేసుకుందామని చూస్తే ఇప్పుడీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అవతార్ రీరిలీజ్ ది కూడా ఇదే సమస్య. ఒకవేళ ఆసీస్ రెండో మ్యాచ్ కూడా గెలిచి ఉంటే ఇప్పుడున్న ఆసక్తి తగ్గిపోయేది. కానీ జరిగింది వేరు. మొత్తానికి ఇలాంటి టి20 సిరీస్ లు ఉన్నప్పుడు బాక్సాఫీస్ ప్రతిసారి ప్రభావితం చెందుతూనే ఉంది.

This post was last modified on September 25, 2022 1:12 pm

Share

Recent Posts

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

48 minutes ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

1 hour ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

2 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

3 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

3 hours ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

3 hours ago