ఇస్మార్ట్ శంకర్ మూవీతో లేక లేక కెరీర్లో ఒక లైఫ్ లైన్ దొరికింది పూరి జగన్నాథ్ కు. గత దశాబ్ద కాలంలో తన సొంత కథతో పూరి కొట్టిన ఏకైక హిట్ ఇది. దీంతో అభిమానులకు మళ్లీ ఆయన మీద గురి కుదిరింది. విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో ఆయన్ని నమ్మి సినిమా చేశాడు. కానీ ఇటు అభిమానులు, అటు విజయ్ నమ్మకాన్ని పూరి నిలబెట్టుకోలేకపోయాడు. లైగర్ మూవీతో అందరినీ తీవ్ర నిరాశకు గురి చేశాడు.
సినిమా యావరేజ్ అనే స్థాయిలో ఉన్నా విజయ్ తన పెర్ఫామెన్స్ తో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేవాడు. కానీ పూరి మరీ పేలవమైన సినిమా తీయడంతో విజయ్ పెర్ఫామెన్స్ కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. ఈ దెబ్బతో పూరి పరిస్థితి ఘోరంగా తయారైంది. పెద్ద స్టార్ల సంగతి పక్కన పెట్టేస్తే మిడ్ రేంజ్ హీరోలు కూడా ఆయనకు డేట్లు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది.
ఈ స్థితిలో తన కొడుకు ఆకాశ్ తో పూరి ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. దాని గురించి క్లారిటీ లేదు. కానీ ఈలోపు పూరి చూపు రామ్ మీద పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరి వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న టైంలో ఆయన్ని నమ్మి ఇస్మార్ట్ శంకర్ చేశాడు రామ్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఇద్దరి కెరీర్లకూ ఊపు తెచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని గతంలో ఇద్దరూ ప్రకటించారు. కానీ తర్వాత వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఇప్పుడు పూరీకి ఇంకే హీరో దొరికే పరిస్థితి లేదు.
ఇటీవల ది వారియర్ తో గట్టి ఎదురు దెబ్బ తిన్న రామ్.. బోయపాటి శ్రీను సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈలోపు పూరి అతణ్ని కలిశాడని.. తనతో సినిమా చేసేందుకు కమిట్మెంట్ తీసుకున్నాడని అంటున్నారు. రామ్ తో కుదిరినపుడు పూరి సినిమా చేయాలనుకుంటున్నాడని.. ఇస్మార్ట్ శంకర్-2 కోసమే ఇద్దరూ జట్టు కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.
This post was last modified on September 23, 2022 3:12 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…