చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్‌లో సల్మాన్ ఖాన్‌తో ప్రత్యేక పాత్ర చేయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సల్మాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు అంత ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక హిందీ వెర్షన్ కోసం ఆయన్ని పెట్టారేమో అనుకుందామంటే.. ఒక రీమేక్, పైగా రొటీన్ మాస్ మూవీని హిందీలో రిలీజ్ చేసి ఏం సాధిస్తారు, సల్మాన్ కాసేపు కనిపిస్తే హిందీ ప్రేక్షకులు దీన్ని నెత్తిన పెట్టేసుకుంటారా అన్న సందేహాలు కూడా వినిపించాయి.
కానీ చిరు అండ్ కో ఏ ప్లానింగ్ లేకుండా, ఆషామాషీగా ఏమీ సల్మాన్‌ను ఈ సినిమాలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. లో బజ్‌తోనూ ఈ సినిమాకు జరిగిన బిజినెస్ గురించి వస్తున్న వార్తలు చూస్తే సల్మాన్ ఫ్యాక్టర్ ఎంత కీలకమో అర్థమవుతోంది.
గాడ్ ఫాదర్ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.90 కోట్ల మేర అమ్మినట్లు తెలుస్తోంది. ఇది మరీ పెద్ద ఫిగరేమీ కాదు. చివరి గత సినిమా ఆచార్య కంటే 30 కోట్లు తక్కువకే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ గాడ్ ఫాదర్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ మాత్రమే భారీ రేట్లే పలికినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ రూ.57 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. ఇక రెండు భాషల్లో కలిపి శాటిలైట్ హక్కులు రూ.60 కోట్ల దాకా తెచ్చిపెట్టినట్లు సమాచారం. ఈ రెండు రైట్స్‌కు ఈ స్థాయిలో రేటు రావడానికి ప్రధాన కారణం సల్మాన్ అనడంలో సందేహం లేదు.
హిందీలో సల్మాన్‌కు ఉన్న రీచ్ అలాంటిది మరి. ఆయన సినిమాలకు మామూలుగానే డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో వంద కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ జరుగుతుంది. గాడ్ ఫాదర్‌లో సల్మాన్ అతిథి పాత్ర చేయడంతో హిందీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఉంటుంది. ఇక తెలుగు వరకు చూసుకుంటే చిరంజీవి ఫ్యాక్టర్ ఎలాగూ ఉంది. కాబట్టి గాడ్ ఫాదర్‌కు ఆ స్థాయి రేట్లు పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on September 22, 2022 4:37 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…