మాములుగా ఏదైనా సినిమా ఓటిటికి అమ్మేసినప్పుడు దాని హక్కులు శాశ్వతంగా ఉంటాయనుకుంటారు కానీ ఈ ఒప్పందాలకూ కాల పరిమితి ఉంటుంది. అది దాటాక ఆ ప్లాట్ ఫార్మ్ కు గుడ్ బై చెప్పాల్సిందే. లేదూ కొనసాగాలంటే మాత్రం నిర్మాతకు తిరిగి రెన్యూవల్ చేసుకోవడమో అతను అడిగిన మొత్తాన్ని ఇవ్వడమో చేయాలి. ఒక్కోసారి వీటి ప్రభావం గట్టిగానే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వీటిని పదే పదే చూసే నోస్టాల్జియా ఫ్యాన్స్ లక్షలు కోట్లలో ఉన్నారు.
వాళ్లందరికీ షాక్ ఇస్తూ ఇంకో పది రోజుల్లో ఇవి ప్రైమ్ నుంచి సెలవు తీసుకోబోతున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై, మొహబత్తే, రబ్ నే బనా ది జోడి, చక్ దే ఇండియా, జబ్ తక్ హై జాన్, డర్, లమ్హే, సిల్సిలా, కభీ కభీ, కాలా పత్తర్, దాగ్, బ్యాండ్ బాజా బారాత్, ఫనా, సలాం నమస్తే, ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3, గుండే, సాథియా, ఏ ధిల్లగి, విజయ్, మషాల్ లాంటి ఎన్నో ఎవర్ గ్రీన్ టైం లెస్ క్లాసిక్స్ అన్నీ ఇకపై అందులో ఉండవు. వీటికోసమే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు తీవ్ర నిరాశ కలిగిస్తూ అక్టోబర్ 1 నుంచి వెళ్లిపోతున్నాయి.
తర్వాత హాట్ స్టార్ లో రావొచ్చనే టాక్ ఉంది కానీ ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు. టాలీవుడ్ లోనూ ఇలా గంపగుత్తగా పేరుమోసిన బ్యానర్లు తమ క్లాసిక్స్ ని కొన్ని ఓటిటిలకు, శాటిలైట్ ఛానల్స్ కు ఎక్కువ కాలానికి హక్కులు ఇచ్చేశారు. భవిష్యత్తులో టైం ఎక్స్ ఫైర్ అయినప్పుడు అభిమానులు ఇలాంటి వాటికి ముందే ప్రిపేర్ అవ్వాలి. రాను రాను యూట్యూబ్ కూడా పూర్తి కమర్షియల్ రూపం తీసుకుంటోంది. యాడ్స్ వద్దంటే డబ్బులు కట్టమంటోంది. కొత్త సినిమాల సంగతేమో కానీ ఇలా పాత చిత్రాలు కూడా ఓటిటిల నుంచి షిఫ్ట్ అయిపోతే ఓటిటిలకు ఇబ్బందే
This post was last modified on September 22, 2022 10:37 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…