ఈ మధ్య చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు హీరోలూ పాన్ ఇండియా సినిమాలు చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అవతల ఏ స్థాయిలో సినిమాలు రిలీజవుతాయి.. వేరే భాషల వాళ్లు అసలు సినిమాను పట్టించుకుంటారా లేదా అని చూడకుండా పాన్ ఇండియా సినిమా అంటూ ఘనంగా అనౌన్స్‌మెంట్లు అయితే చేసేస్తున్నారు. ఘనంగా పోస్టర్లూ రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల కార్తికేయ-2తో నిఖిల్ అనే చిన్న హీరో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించాడు.
ఇప్పుడు మరో యంగ్ హీరో శ్రీ విష్ణు పాన్ వరల్డ్ మూవీకి రెడీ అవుతుండడం విశేషం. తనకు తాను ఇది పాన్ వరల్డ్ మూవీ అనేమీ చెప్పుకోవట్లేదు కానీ.. నిజంగానే అతను ఆ స్థాయి సినిమా చేయబోతుండడం విశేషం.
ఒక యూరోపియన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే అంతర్జాతీయ స్థాయి సినిమాలో శ్రీ విష్ణు ముఖ్య పాత్ర పోషించనున్నాడట. ఇది చాలా మంచి ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అంటూ దీని వివరాలు వెల్లడించాడు విష్ణు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని, ఇందులో చాలా పెద్ద పెద్ద నటులు కీలక పాత్రలు చేస్తారని.. వాళ్లతో పాటు తనకూ ఓ పాత్ర దక్కిందని.. ఇందులో ఒక్కో పాత్ర ఒక్కో భాష మాట్లాడుతుందని, తాను తెలుగులో మాట్లాడతానని.. ఇది గమ్మత్తయిన సినిమా అని శ్రీ విష్ణు తెలిపాడు.
త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. ఇది పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పనని.. కానీ పెద్ద రేంజ్ మూవీ అని శ్రీ విష్ణు చెప్పాడు. దీంతో పాటు తాను రాజ రాజ చోర దర్శకుడు హాసిత్ గోలితో మైత్రీ మూవీస్ బేనర్లో ఓ సినిమా, హుషారు ఫేమ్ హర్షతో ఓ చిత్రం, సాయి అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నట్లు శ్రీ విష్ణు వెల్లడించాడు.
This post was last modified on September 21, 2022 5:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…