దసరా పోటీ రానురాను మరింత రంజుగా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ క్లాష్ పట్ల ట్రేడ్ విపరీతమైన అంచనాల్లో ఉండగా ఎలాంటి సౌండ్ లేకుండా బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం కూడా బరిలో దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా మంచు విష్ణు జిన్నా సైతం అక్టోబర్ 5నే టార్గెట్ చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న టీజర్, గోలీసోడా లిరికల్ వీడియో మాత్రమే బయటికి వచ్చాయి. ఇంకా ట్రైలర్ కట్, బ్యాలన్స్ పాటలు చాలానే ఉన్నాయి.
ఒకవేళ ఇది నిజమే అయితే మంచు బ్యానర్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ఇద్దరు సీనియర్లకు ఎదురెళ్ళడం అంత ఈజీ కాదు. పైగా వాటి మీదున్న అంచనాలు వేరే. విష్ణు ముందు నుంచి జిన్నా మీద చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ఢీని మించిన కెరీర్ బెస్ట్ అవుతుందని హామీ ఇస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల గ్లామర్ ని గట్టిగానే వాడేశారు. ఇదంతా సరే కానీ ఒక విలేజ్ డ్రామాతో ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆశిస్తున్న విష్ణు ఒకవేళ పోటీ లేకుండా సోలోగా వేరే టైంలో వచ్చి ఉంటే మంచి ఫలితం దక్కేదేమో కానీ ఇంత కాంపిటీషన్ మధ్య నెగ్గుకురావడం అంత సులభం కాదు.
పండగ సీజన్ లో మూడు నాలుగు సినిమాలకు స్పేస్ ఉంటుంది నో డౌట్. కానీ మార్కెట్ లో హీరోల ఇమేజ్ క్యాలికులేషన్లు ఎక్కువగా ఉంటాయి. అసలే విష్ణు గ్రాఫ్ 2016 తర్వాత అస్సలు బాలేదు. లక్కున్నోడు, గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్లు ఇవన్నీ మాములు డిజాస్టర్లు కాదు. నిర్మాతగానూ సన్ అఫ్ ఇండియా లాంటి ట్రాక్ రికార్డు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్ రూపంలో విపరీతమైన నెగిటివిటీ చుట్టుముట్టిన తరుణంలో జిన్నా ఓ రేంజ్ లో ఉంటేనే ఫలితం దక్కుతుంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారట.
This post was last modified on September 21, 2022 9:38 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…