సత్యదేవ్ సినిమాకు ఎన్ని కష్టాలో

మాములుగా ఎంతో కొంత ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ చేయడం మరీ కష్టమేమీ కాదు. ప్రొడ్యూసర్ బ్యాక్ అప్ ఉండి, కంటెంట్ మీద జనంలో కాస్తంత ఆసక్తి కలిగేలా చేస్తే చాలు ఏదోలా బిజినెస్ క్లోజ్ చేయొచ్చు. ఫలితం అటుఇటు అయినా డిజిటల్ ఆదాయం ఆదుకుని ఒడ్డున పడేస్తుంది. కాని సత్యదేవ్ కొత్త మూవీ మాత్రం విడుదలకు అష్టకష్టాలు పడుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నాతో మొదటిసారి జంట కట్టిన గుర్తుందా శీతాకాలం ట్రైలర్ ఆన్ లైన్లో వచ్చి ఏడు నెలలు దాటేసింది. మూడు మిలియన్లకు పైగా వ్యూస్ తో బాగానే హంగామా చేసింది.

కానీ పదే పదే పడుతున్న వాయిదాలు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. 2020లో వచ్చిన కన్నడ సూపర్ హిట్ లవ్ మాక్ టైల్ కి ఇది అఫీషియల్ రీమేక్. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్కూల్ నుంచి కాలేజీ దాకా జరిగిన సంఘటనల సమాహారంగా దీన్ని ఒక ఎమోషనల్ డ్రైవ్ గా ప్రెజెంట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ కి డార్లింగ్ కృష్ణ దర్శకత్వం వహించగా తెలుగుకి నాగశేఖర్ డైరెక్టర్. మేఘా ఆకాష్, కావ్య శెట్టి ఇలా గ్లామర్ కోషంట్ ని బాగానే సెట్ చేశారు. ఇటీవలే కార్తికేయ 2తో అదరగొట్టిన కాలభైరవ సంగీతం సమకూర్చడం మరో ఆకర్షణ.

నిజానికి ఈ 23 రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నారు కానీ ఇంకోసారి పోస్ట్ పోన్ తప్పలేదు. కారణం ఏదైనా ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాంటి విపరీత భావోద్వేగాల ప్రేమకథలను థియేటర్లో చూసేందుకు జనం అంతగా ఇష్టపడటం లేదు. నాగచైతన్య థాంక్ యు తిరస్కారానికి గురయ్యింది అందుకే. సరే శీతాకాలం ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టుతో వస్తోంది కాబట్టి నమ్మొచ్చు కానీ అసలింతకీ బయటికి వస్తేగా. గాడ్సే డిజాస్టర్ తో సత్యదేవ్ కు సోలో హీరో మార్కెట్ ఇంకాస్త డౌన్ అయ్యింది. గాడ్ ఫాదర్ తర్వాత మళ్ళీ పికప్ అవుతాననే నమ్మకం కనిపిస్తోంది. మరి శీతాకాలం ఈ సంకెళ్లు ఎప్పుడు తెంచుకుంటుందో