మంచి పాజిటివ్ టాక్ వచ్చి మొదటి మూడు రోజులు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టిన ఒకే ఒక జీవితం ఆ తర్వాత వీక్ డేస్ లో నెమ్మదించింది. కొత్త రిలీజులు ఎక్కువగా ఉండటంతో మళ్ళీ పికప్ ఉండదేమో అనుకున్నారు. అయితే అనూహ్యంగా వచ్చినవేవీ కనీస స్థాయిలో మెప్పించేలా లేకపోవడంతో శర్వా సినిమాకు మళ్ళీ కలెక్షన్లు పెరిగాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చోట్ల ఫుల్స్ పడటం దానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాలు, పట్టణాలు ఊహించని ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. బాగా డల్ అయిన బ్రహ్మాస్త్ర సైతం ఒక్కసారిగా ఊపందుకుంది.
అంతో ఇంతో అంచనాలతో వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలికి డివైడ్ టాక్ మళ్ళీ రికవర్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. నేను మీకు బాగా కావాల్సినవాడినికి నిన్న ఈవెనింగ్ షోల నుంచే డెఫిషిట్లు స్టార్ట్ అయ్యాయని ట్రేడ్ టాక్. ఇక శాకినీ డాకిని మీద జనానికి కనీస ఆసక్తి లేకపోవడం తోడు రెస్పాన్స్ కూడా సోసోగా రావడంతో దాని పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సన్ డే టైం పాస్ కోసం ఒకే ఒక జీవితంనే ఆడియెన్స్ బెస్ట్ ఆప్షన్ గా తీసుకుంటున్నారు. ఇది శర్వానంద్ అనుకోకుండా కలిసి వచ్చిన సానుకూల అంశమే.
ఇంకో అయిదు రోజులు ఈ ఛాన్స్ ని వాడుకోవచ్చు. థియేటర్లకు పబ్లిక్ బాగా రావాలంటే కంటెంట్ ఎంత కీలకమో గత రెండు నెలల బాక్సాఫీసు పరిణామాలు గమనిస్తే చెప్పొచ్చు. పబ్లిసిటీ గిమ్మిక్కులు, ప్రీ రిలీజ్ స్టంట్లు ఎన్ని చేసినా మ్యాటర్ ఉన్న బొమ్మలకే బ్రహ్మరథం పడతామని స్పష్టంగా తీర్పులిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాదాసీదా కథలతో తిరస్కారం తప్పదనే వాస్తవం అందరికీ అర్థమవుతోంది. కృష్ణంరాజుగారి హఠాన్మరణం ఆయనకు నివాళి ఇచ్చే కారణంగా ఒకే ఒక జీవితం ప్రమోషన్లకు బ్రేక్ వేసింది కానీ లేదంటే ఇంకొంత రీచ్ ఎక్కువగా ఉండేదన్న కామెంట్లో నిజం లేకపోలేదు.
This post was last modified on September 18, 2022 7:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…