Movie News

ఘర్షణ 2 ఉంది కానీ

విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఘర్షణతో చాలా స్పెషల్ కనెక్షన్ ఉంది. వెంకీ అంతకు ముందు ఖాకీ డ్రెస్సులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఇందులో కనిపించినంత సీరియస్ గా స్టైలిష్ గా మరెందులోనూ లేరు. తమిళ బ్లాక్ బస్టర్ కాకాకాకాకు రీమేక్ గా రూపొందిన ఈ కాప్ డ్రామా 2004లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు టాలీవుడ్ డెబ్యూ ఎంట్రీ. అందుకే ఆయనకూ ఇది స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. వచ్చి పద్దెనిమిదేళ్లు అవుతున్నా దానికి సీక్వెల్ కావాలన్న డిమాండ్ ఫ్యాన్స్ నుంచి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది కానీ ఆ ఆశలు నెరవేరే సూచనలు కనిపించలేదు.

ఎట్టకేలకు వాటికి గౌతమ్ మీననే చెక్ పెట్టారు. ఘర్షణ కొనసాగింపు కోసం ఇటీవలే వెంకటేష్ ను కలిశానని, సానుకూల స్పందన వచ్చిందని, భవిషత్తులో ఖచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చని భరోసా ఇచ్చాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ అయితే మొదలుపెట్టనేలేదు. త్వరలో స్టార్ట్ చేస్తారట. గౌతమ్ లేటెస్ట్ మూవీ శింబు ది లైఫ్ అఫ్ ముత్తు ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనే ఈ కబుర్లను పంచుకున్నారు. ఇదొక్కటే కాదు కమల్ హాసన్ కు సైతం ల్యాండ్ మార్క్ గా నిలిచిన రాఘవన్ కు సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది షురూ చేస్తారట.

ఇదంతా ఒక ఎత్తు అయితే మెగాస్టార్ చిరంజీవితోనూ ఇలాంటి సీరియస్ డ్రామాను తీయాలనే కాంక్షను వెలిబుచ్చారు. నిజానికి ఈ కాంబో మూవీ లవర్స్ ఎప్పుడో కోరుకున్నారు. కానీ సాధ్యపడలేదు. పదే పదే రీమేకులు, రొటీన్ కమర్షియల్ కథలను చేయడం కంటే ఇలాంటి సబ్జెక్టులు చేస్తే చిరుకి కూడా విక్రమ్ హిట్ లిస్ట్ లాగా ఏదైనా కంబ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంత కాలంగా దర్శకత్వానికి గ్యాప్ ఇస్తూ నటన మీద ఎక్కువ ఫోక్స్ చేసిన గౌతమ్ మీనన్ నిజంగా ఇప్పుడు చెప్పినవన్నీ కార్యరూపంలోకి తీసుకొస్తే చిరు, కమల్, వెంకీలను మరోసారి కిక్ యాస్ యాక్షన్ లో చూడొచ్చు .

This post was last modified on September 18, 2022 4:51 pm

Share

Recent Posts

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

51 minutes ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

2 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

2 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

7 hours ago

గొప్ప నిర్ణ‌యం: ఏపీలోనే విదేశీ విద్య‌!

ప్ర‌స్తుతం విదేశీ విద్య‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్‌, ర‌ష్యా స‌హా..…

9 hours ago

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

11 hours ago