గాడ్ ఫాదర్ కౌంట్ డౌన్ వారాల నుంచి రోజుల్లోకి వెళ్ళిపోతోంది. అయినా కూడా యూనిట్ ప్రమోషన్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తారాస్థాయికి చేరుస్తోంది. ఇంతకీ అక్టోబర్ 5 విడుదల ఉంటుందా లేదానేది కూడా సస్పెన్స్ గా మారుతోంది. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు చెప్పిన భారీ ధరకు ఒప్పుకోవడం లేదని, ఆచార్య అనుభవం దృష్ట్యా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరని వస్తున్న వార్తలు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. అయినా కూడా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వైపు నుంచి ఎలాంటి చలనం లేదు.
తాజాగా గాడ్ ఫాదర్ పోస్ట్ థియేటర్ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారమే కాబట్టి ఇందులో డౌట్ అక్కర్లేదు కానీ ముందైతే బొమ్మని రిలీజ్ చేస్తే ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పటికీ తక్కర్ మార్ లిరికల్ వీడియోకు సంబంధించిన యుట్యూబ్ అప్డేట్ రానే లేదు. ఎదురుచూపుల్లోనే రోజులు గడిచిపోతున్నాయి. ఇతర యాప్స్ లో బయటికి వచ్చిన పాట గురించి గొప్ప ఫీడ్ బ్యాక్ ఏమీ లేదు. దర్శకుడు మోహన్ రాజా వైపు నుంచి కూడా ట్విట్టర్ లో మూమెంట్ లేదు.
అటుచూస్తే అదే రోజు వస్తున్న నాగార్జున ది ఘోస్ట్ మెల్లగా సౌండ్ పెంచేస్తోంది. అసలే అంచనాలు లేని బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం బృందం ఇంటర్వ్యూలు గట్రా మొదలుపెట్టారు. కానీ గాడ్ ఫాదర్ మాత్రం ఘాఢ నిద్రలో ఉన్నాడు. ఇంతటి నిర్లిప్తత ఎందుకో అంతు చిక్కని రహస్యంగా నిలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపూర్ లో చేస్తారని మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. పోనీ ఇదైనా అఫీషియల్ గా చెబుతున్నారా అంటే అదీ లేదు.
This post was last modified on September 18, 2022 4:54 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…