పేరుకి డబ్బింగ్ సినిమాలంటాం కానీ ఒకప్పుడవి స్ట్రెయిటే అనిపించేంత సహజంగా వాటిలో సంభాషణలు, పాటలు ఉండేవి. ఎంత జాగ్రత్తగా లిప్ సింక్ ని గమనించినా గుర్తుపట్టడం కష్టమనేంత స్థాయిలో రైటర్లు, అనువాద గాత్రదాతలు విపరీతంగా కష్టపడేవారు. సుప్రసిద్ధ రచయిత రాజశ్రీ ఇందులోనే అపార అనుభవం గడించడంతో పాటు ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఆయన దారిలోనే వెన్నెలకంటి తదితరులు మంచి పేరు తెచ్చుకున్నారు. సాంగ్స్ విషయంలోనూ ఏ మాత్రం నిర్లక్ష్యం కనిపించేది కాదు. సాహిత్య విలువలు కొట్టొచ్చినట్టు ఉండేవి.
మణిరత్నం చిత్రాలకు వేటూరి, రామ్ గోపాల్ వర్మ మూవీస్ కి సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి ఉద్దండులు పాటలు రాసినప్పుడు ఒరిజినల్ కంటే బాగున్నాయనే ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు మాత్రం ప్రాస కోసం ప్రయాసలో అసలేం రాస్తున్నారో అర్థం కాని అయోమయం నెలకొంటోంది. ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్ 1లో సై అనే పాట బాషా ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీన్ని రాసింది అనంత శ్రీరామ్. గందరగోళుడు, అయోమయుడు లాంటి చిత్ర విచిత్ర పదప్రయోగాలన్నీ ఇందులో చేశారాయన. ఒరిజినల్ పదాలు ఎలా ఉన్నా ఆ అర్థం వచ్చేలా మన బాష వాడాలి కానీ మరీ ఇంతగా కాదు.
ఎవరూ సృష్టించకాపోతే మాటలెలా పుడతాయని మాయాబజార్ లో ఎస్విఆర్ చెప్పినట్టు ఇప్పటి పాటల్లో ఈ సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఆ మధ్య ఆచార్య నీలాంబరిలో నన్నారి అని వాడటం, సర్కారు వారి పాట కళావతిలో, వరుడు కావలెను దిగుదిగునాగలో వెరైటీగా ఎక్స్ పరిమెంట్లు చేసినప్పుడు కామెంట్లు వచ్చి పడ్డాయి. అయినా నిజంగా వాడుకలో ఉన్న లేదా భాషలో ఉన్న పదాలను వాడుకుంటే తప్పు కాదు. అది విద్వత్తు కూడా. అలా కాకుండా ప్రాస కోసం లేని ప్రయోగాలు చేస్తే భవిష్యత్తు తరాలు ఇదే తెలుగనే ప్రమాదం లేకపోలేదు. అడిగితే అనంతుడు పలురకాలుగా సమర్ధించుకోవచ్చు కానీ ఇది మాత్రం రాంగే.
This post was last modified on September 17, 2022 10:28 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…