కొత్తగా అంత పేరున్న సినిమాలేవీ రిలీజ్ కాకుంటే, కొత్తగా విడుదలైన సినిమాలకు సరైన టాక్ లేకుంటే.. బాక్సాఫీస్ దగ్గర పాత చిత్రాలు అడ్వాంటేజ్ తీసుకోవడం మామూలే. కానీ బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ఈ అడ్వాంటేజీని పెద్దగా ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఈ నెల 9న రిలీజైన బ్రహ్మాస్త్ర డివైడ్ టాక్‌తోనూ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ దాని ప్రతాపం అంతా తొలి వీకెండ్‌కే పరిమితం అయింది.
సోమవారం నుంచి సినిమా డల్లయిపోయింది. వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. వీక్ డేస్ అంతా నామమాత్రమైన వసూళ్లు రాబట్టింది. ఐతే వీకెండ్ వచ్చాక సినిమా పుంజుకుంటుందని ఆశించారు. కానీ పరిస్థితులు బాగా కలిసొచ్చినా సరే.. సినిమా అనుకున్న స్థాయిలో పెర్పామ్ చేయట్లేదు.
ఈ వీకెండ్లో హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిని కూడా అక్కడి జనం పట్టించుకోవట్లేదు. ఇక తెలుగు విషయానికి వస్తే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మీకు నేను బాగా కావాల్సిన వాడిని, శాకిని డాకిని చిత్రాల్లో ఏవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మిగతా సినిమాలను జనం అసలే పట్టించుకోలేదు. దీంతో రెండో వారం కూడా అటు హిందీలో, ఇటు తెలుగులో బాక్సాఫీస్ లీడర్ బ్రహ్మాస్త్రనే అయింది.
ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే దీనికి వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయి కానీ.. బయ్యర్లు ఆశించిన స్థాయిలో మాత్రం కాదు. శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.8.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఇండియాలో ఆ చిత్రం రూ.200 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. వీకెండ్లో రోజుకు 30-40 కోట్లు వస్తే తప్ప బయ్యర్లు బయట పడేలా లేరు. తెలుగు వరకు సినిమా బ్రేక్ ఈవెన్ అయినా హిందీలో మాత్రం సగం కూడా రికవరీ అవ్వలేదు. వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంటే సినిమా ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో ఏమైనా పరిస్థితి మెరుగుపడుతుందేమో చూడాలి.
This post was last modified on September 17, 2022 6:57 pm
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…