సమ్మోహనం.. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఒకటి. ఆ సినిమా మొదలైనపుడు ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు నటుడిగా తడబడుతున్న సుధీర్ బాబుతో సినిమా తీయడమేంటి అని సందేహించారు. కానీ సుధీర్ బాబులో ఎంత మంచి నటుడున్నాడో ఈ సినిమాతో రుజువు చేశాడు ఇంద్రగంటి. అతడి నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్ రాబట్టుకోవడమే కాక.. అదితి రావు హైదరిని అద్భుతంగా చూపించి… హృద్యమైన ప్రేమకథను అందంగా ఆవిష్కరించి ప్రేక్షకుల మనసు దోచాడు.
థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఆ చిత్రం.. ఆ తర్వాత టీవీలో, ఓటీటీలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఈ కలయికలో ఇంకో సినిమా అనగానే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.
టైటిల్ దగ్గరే సగం మార్కులు కొట్టేసిన ఇంద్రగంటి.. ప్రోమోలతోనూ ఆకట్టుకున్నాడు. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ చూస్తే సమ్మోహనంతో చాలా పోలికలు కనిపించాయి. అది సినిమాకు ప్లస్సే కాక మైనస్ కూడా. సినిమాకు బజ్ క్రియేట్ కావడం ఈజీనే కానీ.. పోలికలు చేటు చేస్తాయి. సినిమా అదే తరహాలో ఉంటే కొత్తదనాన్ని ఫీలవ్వరు. ప్రతిదీ పాత సినిమాతో పోల్చుకుని చూస్తారు. మరి ఈసారి ప్రేక్షకులకు ఇంద్రగంటి ఎలాంటి అనుభూతిని ఇస్తాడన్నది ఆసక్తికరం.
సుధీర్ సంగతి ఏమో కానీ.. అదితిరావు హైదరి తరహాలో మెప్పించడం కృతికి సవాలే. మరి ఆమె సవాలును ఎలా స్వీకరిస్తుందో చూడాలి. ఈ శుక్రవారం దీంతో పాటుగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని, శాకిని డాకిని చిత్రాలు కూడా రిలీజవుతున్నాయి. వాటి మీద మరీ అంచనాలేమీ లేవు. శనివారం డబ్బింగ్ మూవీ ది లైఫ్ ఆఫ్ ముత్తు కూడా విడుదలవుతోంది. తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేర ఆకర్షిస్తుందో చూడాలి.
This post was last modified on September 16, 2022 10:18 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…