Movie News

సినిమా డే మార్పు వెనుక బ్రహ్మాస్త్రం

ఎప్పుడో రెండు వారాల క్రితం సెప్టెంబర్ 16ని నేషనల్ సినిమా డేగా ప్రకటించి ఆ రోజు మల్టీప్లెక్సులన్నీ టికెట్ రేట్ ని కేవలం 75 రూపాయలకు అమ్ముతామని ప్రకటించడం మూవీ లవర్స్ గుర్తు పెట్టుకున్నారు. అయితే హఠాత్తుగా దాన్ని వారం వాయిదా వేసి సెప్టెంబర్ 23కి షిఫ్ట్ చేయడం ఆశ్చర్యపరిచింది. ఈ ఆఫర్ బాగుంది కదాని అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు సదరు అసోసియేషన్ స్వీట్ షాక్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ ప్రభావం ఉందని ముంబై టాక్. వివరాల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది.

బ్రహ్మాస్త్ర తెలుగు రాష్ట్రాల్లో మొన్న సోమవారం నుంచి నెమ్మదించింది కానీ ఉత్తరాదిలో మాత్రం నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. కనీసం పది రోజుల పాటు ఈ కలెక్షన్లు స్టడీగా ఉంటాయని ట్రేడ్ నమ్మకంతో ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి నగరాల్లో ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో టికెట్ ధర 200 నుంచి 900 రూపాయల పైమాటే ఉంటుంది. అయినా కూడా హై క్లాస్ జనాలు చూస్తున్నారు. ఇప్పుడు ఎనిమిదో రోజే వాటిని 75 రూపాయలకు ఇచ్చేస్తే రెవిన్యూ చాలా తీవ్రంగా దెబ్బ తింటుంది. జనాలు ఫుల్లుగా వస్తారు కానీ గల్లా పెట్టెలు డల్లుగా ఉంటాయి.

అందుకే అలోచించి ఇలా అయితే వర్కౌట్ కాదని గుర్తించి నీట్ గా షిఫ్ట్ చేశారన్న మాట. ఆ తేదీకి పెద్ద బాలీవుడ్ సినిమాలేం లేవు. అవతార్ కూడా పాత రీ రిలీజ్ కాబట్టి భారీ రేట్లకేం అమ్మలేదు. ఎటొచ్చి తెలుగులో అదే రోజు వస్తున్న అల్లూరి, గుర్తుందా శీతాకాలం, దొంగలున్నారు జాగ్రత్త, కృష్ణ వృందా విహారి లాంటి వాటికి కొన్ని ఇబ్బందులు తప్పవు. హిందీలో దుల్కర్ సల్మాన్ చుప్ ఉంది కానీ అదేమీ ప్యాన్ ఇండియా మూవీ కాదు. మొత్తానికి బ్రహ్మాస్త్ర కోసమే మల్టీప్లెక్సులు డెసిషన్ మార్చుకున్నాయన్న కామెంట్ లో లాజిక్ ఉంది. బయటికి చెప్పలేదు కానీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on September 13, 2022 10:24 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

1 hour ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago