ఇండియాలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు తక్కువ. అందులోనూ టైం ట్రావెల్ మూవీస్ మరీ తక్కువ. అలా అని ఈ సినిమాలు ఇక రాదా… ఆ జానర్ సినిమాలు సరిగా ఆడవా అంటే అదేమీ లేదు. తెలుగులో ఈ నేపథ్యంలో వచ్చిన ఆదిత్య 369 ఎలా ఆల్ టైం క్లాసిక్ గా నిలబడింది తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గానూ మంచి ఫలితమే అందుకుంది. ఇక కొన్నేళ్ల ముందు సూర్య హీరోగా విక్రమ్ కుమార్ రూపొందించిన 24 మూవీ కూడా ట్రైన్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఈ జానర్ ను డీల్ చేయడం అంత తేలిక అయితే కాదు. అందుకే ఎక్కువ మంది ఈ నేపథ్యంలో సినిమాలు తీయలేదు. ఇప్పుడు శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు శర్వానంద్ హీరోగా ఒకే ఒక జీవితం చిత్రాన్ని టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లోనే చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల మనసులు గెలిచాడు. పైన చెప్పుకున్న మూడు చిత్రాలు ఈ నేపథ్యంలోనే సాగినప్పటికీ అవి నడిచే తీరు వేరుగా ఉంటుంది. వాటి కథలు భిన్నం. అలాగే ఒకే ఒక జీవితం కూడా దానికి అదే స్పెషల్. దేనితోనూ పోల్చలేము. ముఖ్యంగా ఇందులోని ఎమోషన్లు, అమ్మ సెంటిమెంట్ దీన్ని భిన్నంగా నిలబెట్టాయి. సినిమాకు అదే ఒక హైలెట్ గా నిలిచింది.
దీనికితోడు త్రిల్ ఫ్యాక్టర్, కామెడీ కూడా బాగానే వర్కవుట్ కావడంతో సినిమా జనరంజకంగా తయారయింది. తొలి రోజు ఉదయం డల్ గానే మొదలైనప్పటికీ పాజిటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ కావడంతో వసూళ్లు పుంజుకున్నాయి. సినిమా మంచి హిట్ అయ్యేలా కనిపిస్తోంది. కాబట్టి టైం ట్రావెల్ హిట్ ఫార్ములా అని మరోసారి రుజువైంది.
This post was last modified on September 11, 2022 10:53 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…