సరైన హిట్లు లేక పెద్ద పెద్ద స్టార్ హీరోలే తలలు పట్టుకుంటున్న బాలీవుడ్ లో అలియా భట్ సుడి మాములుగా లేదు. నెపోటిజం విషయంలో సోషల్ మీడియాకు టార్గెట్ గా మారినా, ఇంటర్వ్యూలలో ఆడియన్స్ పట్ల అప్పుడప్పుడు వెటకార భావం ప్రదర్శించినా వరస సక్సెస్ లు మాత్రం తనకే వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీకి వచ్చిన అలియా కెరీర్ ప్రారంభంలోనే హైవే, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాల్లో తన టాలెంట్ ఏంటో చూపించింది. రాజీ గురించి చెప్పాలంటే పీక్స్ అనే మాట చిన్నదే అవుతుంది.
గల్లీ బోయ్ తర్వాత అలియాకు వరస ఫ్లాపులు వచ్చి పడ్డాయి. కళంక్ మెగా డిజాస్టర్ కాగా సడక్ 2 మరీ దారుణంగా విమర్శలు తెచ్చి పెట్టింది. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ లో చేసిన స్పెషల్ సాంగ్ సైతం ఏమంత ఉపయోగపడలేదు. కట్ చేస్తే 2022లో సీన్ రివర్స్ అయ్యింది. కేవలం తన పెర్ఫార్మన్స్, ఇమేజ్ మీదే ఆధారపడిన గంగుబాయ్ కటియావాడి రూపంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో చేతులు కలిపి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పాత్ర పరిధి తక్కువే అయినా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ జోడిగా చేసిన సీత క్యారెక్టర్ మంచి పేరే తెచ్చింది.
ఇప్పుడు భర్త రన్బీర్ కపూర్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ హిట్ క్యాటగిరీలో పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే ఒకే సంవత్సరంలో హ్యాట్రిక్ కొట్టేసినట్టే. ఇంతేకాదు నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ఓటిటి మూవీ డార్లింగ్స్ కు వ్యూస్, కాంప్లిమెంట్సు భారీగా వచ్చి పడ్డాయి. ఇలా తక్కువ గ్యాప్ లో మూడు హిట్లు కొట్టిన హీరోయినే కాదు హీరోలూ ఎవరూ ఈ మధ్య కాలంలో హిందీలో లేరు. దెబ్బకు రణ్వీర్ సింగ్ తో చేస్తున్న రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని మీద అంచనాలు మొదలయ్యాయి. ఎలాగూ బ్రహ్మాస్త్ర మిగిలిన రెండు భాగాలకు తనే హీరోయిన్ కాబట్టి బిడ్డ పుట్టాక ఇంకొంత కాలం ఈ రికార్డుని ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on September 11, 2022 10:38 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…