టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులే కాక లక్షల మంది అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఉజ్వల కెరీర్లో నటుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. ఆయన నట వారసుడు ప్రభాస్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదగడం… అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించడం కృష్ణంరాజుకు అమిత ఆనందాన్ని ఇచ్చే విషయం. కాకపోతే సినిమాల పరంగా, అలాగే వ్యక్తిగతంగా రెండు ముఖ్యమైన కోరికలు తీరకుండానే వెళ్లిపోవడం బాధాకరం.
సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో భక్త కన్నప్ప చిత్రాన్ని భారీ స్థాయిలో తీయాలని ఆయన ఆశ పడ్డారు. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిన చిత్రాన్ని ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేయాలన్నది నా కోరిక. ఈ విషయాన్ని పలు సందర్భంలో ఆయన చెప్పారు. కానీ ప్రభాస్ కు కుదరకో, మరో కారణంతోనో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
ఇక వ్యక్తిగతంగా చూస్తే కృష్ణంరాజుకు తీరని మరో కోరిక ప్రభాస్ పెళ్లి చూడటం. ఈ విషయం గురించి కృష్ణంరాజు దశాబ్దం కిందటి నుంచే మాట్లాడుతూ వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన గట్టిగా ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. చివరగా ఈ పెళ్లి గురించి కృష్ణంరాజు- ప్రభాస్ మధ్యలో ఏం చర్చ జరిగిందో కాని.. ఆయన కూడా ఈ విషయం గురించి మీడియా దగ్గర మాట్లాడట్లేదు. మొత్తంగా చూస్తే ప్రభాస్ కు సంబంధించిన రెండు విషయాల్లో కృష్ణంరాజు కోరికలు తీరలేదన్నది వాస్తవం.
This post was last modified on September 11, 2022 10:18 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…