లెజెండరీ దర్శకులు మణిరత్నం కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఈ నెల 30న విడుదల కానుంది. ఇటీవలే చెన్నైలో కమల్ హాసన్, రజనీకాంత్ ముఖ్యఅతిథులుగా చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించడంతో హైప్ క్రమంగా పెరుగుతోంది. తమిళంతో పోల్చుకుంటే తెలుగులో అంత హైప్ లేదు కానీ ఇక్కడ దిలీజ్ చేస్తోంది దిల్ రాజు కాబట్టి ప్రమోషన్ల పరంగా పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇంత స్కేల్ తో వస్తున్న పిఎస్ 1కు పలురూపాల్లో టెన్షన్లు స్టార్ట్ అయ్యాయి.
అందులో మొదటిది అదే రోజున వస్తున్న బాలీవుడ్ మూవీ విక్రమ్ వేదా. హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ కాంబోలో రూపొందిన ఈ కల్ట్ క్లాసిక్ రీమేక్ డిమాండ్ మాములుగా లేదు. ముఖ్యంగా ఉత్తరాదిలో బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో భారీ సంఖ్యలో మల్టీ ప్లెక్స్ స్క్రీన్లు ఇవ్వబోతున్నారు. ఎలాగూ ఒరిజినల్ వెర్షన్ డబ్బింగ్ ని మనవాళ్ళు చూడలేదు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని వాడుకునేందుకు విక్రమ్ వేదా టీమ్ రెడీ అవుతోంది. ముంబై, ఢిల్లీ, పూణే తదితర చోట్ల నేటివిటీ సమస్య ఉన్న పొన్నియన్ సెల్వన్ ని సీరియస్ గా తీసుకుంటారానేది అనుమానమే.
ఇది చాలదన్నట్టు ధనుష్ కొత్త మూవీ నానే వరువేన్ కూడా అదే రోజు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇటీవలే వచ్చిన తిరు ఏకంగా వంద కోట్ల క్లబ్బులో జాయినవ్వడంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో ఈ టీమ్ ఉంది. ఇది తెలుగులోనూ వస్తుందని వేరే చెప్పాలా. అందులోనూ సెల్వ రాఘవన్ దర్శకుడు. ఆ పేరుకే థియేటర్ కు వెళ్లే ఫ్యాన్స్ ఉన్నారు. సో పొన్నియన్ సెల్వన్ కు బడ్జెట్ పరంగా కాకపోయినా కంటెంట్ పరంగా గట్టి పోటీనే ఇస్తుంది. అసలే అక్టోబర్ మొదటి వారంలో చిరంజీవి, నాగార్జున లాంటి పెద్ద హీరోల సినిమాలున్నాయి. ఈలోగానే పిఎస్ 1 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటేనే గట్టెక్కుతుంది.
This post was last modified on September 10, 2022 10:43 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…