గత ఇరవై నాలుగు గంటల నుంచి గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విడుదల కావడం లేదని, డిసెంబర్ కు వాయిదా వేసే అవకాశం ఉందని జరిగిన ప్రచారం సోషల్ మీడియాని ఊపేసింది. అసలే ప్రమోషన్లు చేయడం లేదని ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అభిమానులను ఇది మరింత ఆగ్రహం కలిగించింది. అయితే అలాంటిదేమీ లేదని నిర్మాతల్లో ఒకరైన ఎన్వి ప్రసాద్ నుంచి కన్ఫర్మేషన్ రావడంతో హమ్మయ్య అనుకున్నారు. త్వరలోనే పబ్లిసిటీని కిక్ స్టార్ట్ చేస్తామని ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఆయన తరఫున సందేశం వచ్చింది. సరే శుభవార్త చెప్పారు కదాని రిలాక్స్ అవ్వడానికి లేదు.
అసలు కథ ఇక్కడి నుంచే మొదలు. ఒకపక్క నాగార్జున ది ఘోస్ట్ అదే రోజు వస్తోంది. ఒకరు ముందు లేదా వెనుక వస్తే బాగుంటుందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అది జరిగే అవకాశం కనిపించడం లేదు. పోటీ అనివార్యమైతే ఓపెనింగ్స్ మీద పరస్పరం ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ప్లానింగ్ జరుగుతోందని పవన్ కళ్యాణ్ అతిథిగా ప్రోగ్రాంని లాక్ చేసే పనిలో ప్రొడ్యూసర్లున్నారనే వార్త విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చింది. ఇది నిజం కావడం కన్నా సగటు మూవీ లవర్స్ కోరుకునేది ఏముంటుంది.
కాకపోతే ఏదైనా వీలైనంత త్వరగా ఓపెన్ అయిపోతే బెటర్. చేతిలో పట్టుమని ముప్పై రోజులు కూడా లేవు. వారం ముందు వచ్చే పొన్నియన్ సెల్వన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అసలేం కాన్ఫిడెన్సో అర్థం కావడం లేదు కానీ బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం కూడా అక్టోబర్ 5కే వస్తోంది. పవన్ మిత్రబృందం స్వంత బ్యానరైన సితార సంస్థ ప్రోడక్ట్ అయినప్పటికీ మెగాస్టార్ తో ఢీ కొట్టాలని ఎందుకు అనుకున్నారో. అది కూడా లవ్ స్టోరీతో. ఇదంతా పక్కనపెడితే అర్జెంటుగా కొత్త పోస్టర్లు, ప్రోమోలు, చిరు సల్మాన్ పాట తాలూకు అప్డేట్లు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోకపోతే ఈ గాసిప్స్ ప్రహసనం మళ్ళీ మొదటికే వస్తుంది.
This post was last modified on September 8, 2022 9:08 am
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…