Movie News

మెగా బ్యానర్ మీద అభిమానుల గుస్సా

స్వంత బ్యానర్ మీదే మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. అచ్చం సైరా, ఆచార్య విషయంలో జరిగినట్టే గాడ్ ఫాదర్ కు సైతం ప్రమోషన్లు నిర్లిప్తంగా నిదానంగా ఉండటం వాళ్లకు నచ్చడం లేదు. చేతిలో నెల రోజులు కూడా లేని నేపథ్యంలో ఇంకెప్పుడు ప్రమోట్ చేయాలనుకుంటున్నారని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇందులో సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణ భాగస్వామి అయినప్పటికీ కొణిదెల ప్రొడక్షన్స్ నే టార్గెట్ చేస్తున్నారు. ఎంత చిరంజీవి ఉన్నా సైలెంట్ గా ఉంటే హైప్ వచ్చే కాలం కాదిది. అది పదే పదే రుజువువుతున్నా మెగా టీమ్ లో మార్పు రావడం లేదనేది వాళ్ళ కంప్లయింట్.

నాగార్జున ది ఘోస్ట్ కూడా అక్టోబర్ 5నే వస్తోంది. ఇద్దరు మిత్రుల క్లాష్ ఎందుకని ఒకరు అడ్వాన్స్ 4నే రిలీజయ్యే అవకాశాల గురించి చర్చలు మొదలయ్యాయి. ఆల్రెడీ ఘోస్ట్ ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి పాటల గురించి పెద్దగా అంచనాలు లేవు. అసలు ఉన్నాయో లేదో తెలియదు. కానీ గాడ్ ఫాదర్ అలా కాదు. తమన్ మొదటిసారి మెగాస్టార్ మూవీకి కంప్లీట్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ చిరుల కలయికలోని పాటని ఏ రేంజ్ లో కంపోజ్ చేశాడోనని మ్యూజిక్ లవర్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

సానుకూల అంశాలు చాలానే ఉన్నప్పటికీ గాడ్ ఫాదర్ వాటిని క్యాష్ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్రల కోసం రాజమౌళి హీరోలను వెంటేసుకుని ఎంత పబ్లిసిటీ చేశాడో చూసి కూడా నేర్చుకోకపోతే ఎలానే ప్రశ్నలో అర్థముంది. లో బడ్జెట్ చిత్రాలే వారాల ముందు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు గట్రా ప్లాన్ చేసుకుంటున్నాయి. నిన్నేదో ఫ్యాన్స్ తిడుతున్నారని గాడ్ ఫాదర్ ఫస్ట్ ఆడియో సింగల్ సూన్ అనే ట్వీట్ తో సరిపెట్టారు కానీ కనీసం అదైనా ఓ కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేసుంటే బాగుండేది. చిరు రిలీజ్ కు ముందు వారం పది రోజులు హడావిడి చేయడం లాంటివి కాకుండా తన టీమ్ ని త్వరగా అలెర్ట్ చేయిస్తే మంచిది.

This post was last modified on September 7, 2022 8:50 am

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago