కార్తికేయ-2.. ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అంటే ఈ చిత్రమే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.14 కోట్లకు జరిగితే.. దాని మీద నాలుగు రెట్ల షేర్ రాబట్టేలా కనిపిస్తోందీ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.100 కోట్లు, షేర్ రూ.50 కోట్లు దాటిపోయింది. నాలుగో వారంలోనూ మంచి షేర్ రాబడుతూ ముందుకు సాగుతోంది ‘కార్తికేయ-2’. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలు వెయ్యి కోట్ల మార్కును కూడా దాటి ఉండొచ్చు కానీ.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ‘కార్తికేయ-2’ వాటిని మించిన బ్లాక్‌బస్టర్ అనడంలో సందేహం లేదు.
హిందీలో 50 షోలతో నామమాత్రంగా మొదలై థియేటర్లు, షోలను వేల సంఖ్యలకు పెంచుకుని కొన్ని వారాలుగా నార్త్ ఇండియాలో బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది ‘కార్తికేయ-2’. ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించడం హీరో నిఖిల్ సిద్దార్థ, దర్శకుడు చందూ మొండేటి కెరీర్లకు పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు. వారి తర్వాతి చిత్రాలకు ఉండే డిమాండే వేరుగా ఉంటుంది.
ఇక నిర్మాతలు ఈ సినిమాతో వచ్చిన లాభాలతో ఇంకో మూణ్నాలుగు సినిమాలు తీసుకోవచ్చు. ఐతే వీళ్లందరి పరిస్థితి బాగానే ఉంది కానీ.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు మాత్రం సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేనట్లే కనిపిస్తోంది. ‘కార్తికేయ-2’లో ఆమె పాత్ర అనుకున్నంతగా హైలైట్ కాలేదు. సినిమాలో ఎక్కడా తన టాలెంట్ చూపించే అవకాశం దక్కలేదు. లుక్స్ పరంగా అనుపమ కెరీర్లోనే అత్యంత సాధారణంగా కనిపించిన సినిమాగా దీన్ని చెప్పుకోవాలి.
ఇంతకు ముందున్న ఆకర్షణ ఇప్పుడు ఆమెలో కనిపించడం లేదు. ‘కార్తికేయ-2’కు సంబంధించి అందరూ ప్రశంసలు అందుకుంటున్నారు కానీ.. అనుపమకైతే పెద్దగా క్రెడిట్ దక్కట్లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించినా అనుపమ కెరీర్‌కైతే పెద్దగా ఉపయోగపడేలా లేదు. దీని తర్వాత నిఖిల్‌కు జోడీగా ఆమె నటించిన ‘18 పేజెస్’ రిలీజ్ కాబోతోంది. అది లవ్ స్టోరీ కాబట్టి అనుపమ హైలైట్ కావడానికి ఛాన్సుంది. ఆ సినిమా సక్సెస్ అయితే ఆమెకు ప్లస్ కావచ్చు.
This post was last modified on September 6, 2022 4:30 pm
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…