ఈ శుక్రవారం కొత్త సినిమాల కన్నా ఒక రోజు ముందు వస్తున్న మూవీ కెప్టెన్. నేనే అంబానీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అల్లు అర్జున్ వరుడులో విలన్ గా నటించి కొంత దగ్గరైన ఆర్య హీరోగా నటించిన చిత్రమిది. పేరుకి 8వ తేదీ రిలీజ్ అన్న మాటే తప్ప ప్రమోషన్లు కానీ పబ్లిసిటీ కానీ పెద్దగా చేస్తున్న దాఖలాలు లేవు. కారణం ఆర్యకిక్కడ చెప్పుకోదగ్గ మార్కెట్ లేకపోవడమే.
ట్రైలర్ కొంత థ్రిల్లింగ్ గా ఏదో ఆసక్తి రేపినప్పటికీ కాన్సెప్ట్ ని సరైన రీతిలో ఆడియన్స్ మెదడులోకి రిజిస్టర్ చేయడంలో టీం తడబడింది. ఫలితంగా ఓపెనింగ్స్ వచ్చేలా కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ సోసోగా ఉన్నాయి. ఇంతా చేసి ఈ కెప్టెన్ ఎప్పుడూ రాని బ్యాక్ డ్రాప్ తో తీసింది కాదు. హాలీవుడ్ మూవీస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ప్రిడేటర్ (1987) గుర్తుండే ఉంటుంది. ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ అప్పట్లో ఇండియాలోనూ భారీ వసూళ్లు అందుకుంది.
కంటికి కనిపించని ఒక వింత జీవి అడవిలోకి వచ్చిన వాళ్ళను దారుణంగా చంపుతూ ఉంటుంది. క్లైమాక్స్ లో హీరో ఒక్కడే మిగిలి కొన్ని ప్రత్యేక టెక్నిక్కులు వాడి దాని అంతం చూస్తాడు. మంచి థ్రిల్ ఉంటుంది సినిమాలో. దీన్నే మన నేటివిటీ అద్ది కెప్టెన్ గా వదులుతున్నారు. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కు ముందు నుంచి ఈ తరహా ప్రయోగాలు చేయడం అలవాటు.
ఆ మధ్య ఓటిటిలో రిలీజైన పిల్లల ఆటబొమ్మ సినిమా టెడ్డి(ఆర్యనే హీరో), అంతకు ముందు జయం రవితో తీసిన జాంబీ చిత్రం యమపాశం, స్పేస్ షిప్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన టిక్ టిక్ టిక్ లాంటివి తీసింది ఇతనే. అవన్నీ కమర్షియల్ గా పెద్ద అద్భుతాలు చేయలేదు కానీ రాజన్ క్రియేటివిటీకి ఎస్ చెప్పే హీరోలే ఎక్కువ. అంతా బాగానే ఉంది కానీ ఇంకో భాషలో సినిమాను తీసుకెళ్తున్నప్పుడు దాన్ని ప్రచారం చేసుకోకపోతే ఎలా. పైగా బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితంలతో పోటీ ఉన్నా సరే ఇంత లైట్ తీసుకుంటారా. ఎందుకో మరి.
This post was last modified on September 6, 2022 9:41 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…