కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజిలోనే క్యాన్సిల్ అవుతుంటాయి. మరికొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోతుంటాయి. అయితే తాజాగా హీరో శర్వానంద్ సినిమా ఒకటి ఇలాగే డిస్కషన్ స్టేజిలోనే ఆగిపోయిందని తెలుస్తుంది. కొన్నేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు శర్వా. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. అయితే హిట్టు మాత్రం అందుకోలేకపోతున్నాడు. శర్వా సినిమాలు వెళ్తున్నాయి అన్నట్టుగా ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. అందుకే ఆడవాళ్ళు మీకు జోహార్లు రిజల్ట్ తర్వాత శర్వా బ్రేక్ తీసుకున్నాడు.
ఆ గ్యాప్ లో కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని భావించాడు. ఇద్దరి మధ్య స్క్రిప్ట్ గురించి కొన్ని డిస్కషన్స్ జరిగాయి. శర్వాకి కథలో కొంత పార్ట్ నచ్చింది ఇంకొన్ని మార్పులు కూడా చెప్పాడట. ఆ మార్పులు అయ్యేలోపే ఇప్పుడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ఫిలిం సర్కిల్స్ టాక్ వినిపిస్తోంది. దానికి రీజన్ ఈ ప్రాజెక్ట్ తర్వాత శర్వా ఓకె చేసుకున్న కృష్ణ చైతన్య సినిమాను తాజాగా ప్రారంభించడం. కొన్ని నెలల క్రితం నితిన్ తో పవర్ పేట అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు కృష్ణ చైతన్య. నితిన్ కూడా ‘పవర్ పేట’ గురించి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఆ సినిమా రెడీ టు స్టార్ట్ అనే స్టేజి వరకూ వెళ్ళింది . కానీ అనుకోకుండా క్యాన్సిల్ అయింది.
వెంటనే శర్వా కి ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు కృష్ణ చైతన్య. ఆ సినిమానే శర్వా 33గా ప్రారంభమైంది. దీంతో ఇక శర్వా రాజు సుందరం కాంబో లేనట్టే అని అర్థమవుతుంది. కొన్నేళ్లుగా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న రాజు సుందరం తమిళ్ లో దర్శకుడిగా అజిత్ తో ఓ సినిమా చేశాడు. కానీ తెలుగులో మాత్రం డైరెక్టర్ గా డెబ్యూ ఇవ్వలేకపోతున్నాడు. మరి త్వరలోనే ఇంకో హీరోని పట్టుకొని సినిమా చేస్తాడా ? లేదా శర్వానే కన్విన్స్ చేసి సెట్ చేసుకుంటాడా ? చూడాలి.
This post was last modified on September 6, 2022 6:11 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…