కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన కుర్రాడు. ప్యార్ కా పంచ్‌నామా-2, సోను కే టిటు కి స్వీటీ లాంటి చిన్న చిత్రాలతో అతను హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత లూకా చుప్పి, పతి పత్ని ఔర్ వోహ్ సినిమాలు కూడా బాగానే ఆడాయి. మధ్యలో ‘లవ్ ఆజ్ కల్-2’ తీవ్ర నిరాశకు గురి చేసినా.. ఈ ఏడాది ‘భూల్ భులయియా-2’తో భారీ విజయాన్నందుకుని తన స్టార్‌డమ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను విస్తరించాడు కార్తీక్. ఐతే గత ఏడాది కార్తీక్ గురించి వరుసగా నెగెటివ్ న్యూస్‌లు మీడియాలో హల్‌చల్ చేశాయి.
అగ్ర నిర్మాత కరణ్ జోహార్ అతణ్ని ‘దోస్తానా-2’ సినిమా నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. స్క్రిప్టు విషయంలో అభ్యంతరాలు చెప్పడంతోనే కరణ్ అతణ్ని సాగనంపేశాడని.. ఇది అతడికి చాలా డ్యామేజ్ చేసే విషయమని ప్రచారం జరిగింది. దీని తర్వాత షారుఖ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఫ్రెడ్డీ’ సినిమా నుంచి కూడా కార్తీక్‌ను తప్పించారన్న వార్త పెద్ద చర్చకే దారి తీసింది.
కరణ్ తర్వాత షారుఖ్ కూడా కరణ్‌ను తమ సినిమాల నుంచి తప్పించడంతో.. అతణ్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, సొంత టాలెంట్‌తో ఎదిగిన కార్తీక్‌ను తొక్కేయాలని చూస్తున్నారని బాలీవుడ్ చర్చ జరిగింది. ఈ స్థితి నుంచి కార్తీక్ పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఈ ఏడాది సంక్షోభంలో ఉన్న బాలీవుడ్‌కు కాస్త ఆశ కల్పించింది కార్తీకే. అతడి సినిమా ‘భూల్ భులయియా-2’ ఇండస్ట్రీకి ఊపిరి పోసే విజయాన్నిచ్చింది. దీంతో అందరూ అతణ్ని పొగడ్డం మొదలుపెట్టారు. కార్తీక్‌ను సేవియర్‌గా కొనియాడారు.
ఇప్పుడు అతడి డిమాండ్ కూడా మామూలుగా లేదు. వరుసగా పెద్ద పెద్ద సినిమాలు అతడి తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ రీమేక్ ‘షెజాదా’లో నటిస్తున్న అతను.. తాజాగా సూపర్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీ ‘ఆషిఖి’లో అవకాశం దక్కించుకున్నాడు. ఆషిఖి, తర్వాత ఆషిఖి-2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా మహేష్ భట్ నిర్మాణంలో అనురాగ్ బసు డైరెక్ట్ చేయబోతున్న క్రేజీ మూవీ ‘ఆషిఖి-3’లో కార్తీకే హీరోగా ఫిక్సయ్యాడు. ఈ ఊపు చూసి కార్తీక్‌ను ఇక ఆపడం కష్టమని.. తొక్కేయాలని చూసిన హీరో ఇంకా పైపైకి ఎదుగుతున్నాడని అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
This post was last modified on September 5, 2022 9:41 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…