థియేటర్లకు ధీటుగా ఇంకా చెప్పాలంటే వాటి కంటెంట్ కంటే ఇంకా బెటర్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇచ్చేందుకు ఓటిటి సంస్థలు వేస్తున్న ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు. బడ్జెట్ విషయంలో కాంప్రోమైజ్ లేకుండా మార్కెట్ ని వీలైనంత కబ్జా చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ తో పోలిస్తే ఇండియాలో వెనుకబడి ఉన్న నెట్ ఫ్లిక్స్ నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని భారీ స్టార్ క్యాస్టింగ్ తో ప్యాన్ ఇండియా మూవీస్ ని రెడీ చేస్తోంది. డివిడి రెంటల్ సర్వీస్ గా మొదలైన నెట్ ఫ్లిక్స్ ఇటీవలే తన 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.
ఈ సందర్భంగా ప్రకటించిన టైటిల్స్ వ్యూయర్స్ ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఓసారి వాటి వరస చూస్తే 1984లో జరిగిన యాంటీ సిక్ ఉద్యమం నేపధ్యంగా తీసుకుని రూపొందిన ‘జోగి’ ఈ నెల 16న రానుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించడం ఆసక్తిని పెంచుతోంది. రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో రూపొందిన ‘మోనికా మై డార్లింగ్’ షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారు. మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో టబు ప్రధాన పాత్రలో విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ చేసిన ‘ఖుఫియా’ మీద అంచనాలు బాగున్నాయి. 1930నాటి పీరియడ్ డ్రామా ‘ఖల’ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది.
జోయా అక్తర్ రూపొందించిన ‘ది ఆర్చీస్’ ద్వారా స్టార్ వారసులు సుహానా ఖాన్(షారుఖ్ కొడుకు), ఖుషి కపూర్(శ్రీదేవి కూతురు), అగస్త్య నంద(అమితాబ్ మనవడు)తెరకు పరిచయం కాబోతున్నారు. సాన్య మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించిన ‘కతల్’ మీద హైప్ బాగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ అనుష్క శర్మ(విరాట్ కోహ్లీ శ్రీమతి)క్రికెటర్ గా నటించిన ‘చక్ దా ఎక్స్ ప్రెస్’ మీద బజ్ తక్కువేమీ లేదు. తమన్నా ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’ ప్రమోషన్లు ఇప్పటికే ఆసక్తి రేపుతున్నాయి. హైజాక్ నేపథ్యంలో రూపొందిన ‘చోర్ నికల్ కె భాగా’లో యామీ గౌతమ్, సన్నీ కౌశల్ తదితరులు ఉన్నారు. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ వరస చూస్తుంటే వందల కోట్లను మంచి నీళ్లలా ఖర్చుపెట్టేందుకు వెనుకాడటం లేదు.
This post was last modified on September 5, 2022 9:40 am
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…