కార్తికేయ-2 సినిమా రిలీజై మూడు వారాలు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆ సినిమా జోరు తగ్గట్లేదు. రిలీజ్ ఆలస్యమైతే అయింది కానీ.. ఈ సినిమాకు మామూలుగా కలిసి రావట్లేదు. వీకెండ్స్‌కు తోడు ఇండిపెండెన్స్ డే.. జన్మాష్టమి.. వినాయక చవితి సెలవులు ఆ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. దీనికి తోడు ‘కార్తికేయ’ రిలీజైన వీకెండ్ నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు నార్త్ ఇండియాలో రిలీజైన ఏ సినిమా కూడా నిలబడలేదు.
ప్రతివారం వస్తున్న సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం.. రెండో రోజు నుంచి వాటి థియేటర్లు వెలవెలబోయి ‘కార్తికేయ’ను మళ్లీ రీప్లేస్ చేయడం.. జనాలు కొత్త సినిమాలను పక్కన పెట్టి ‘కార్తికేయ-2’కే జై కొట్టడం ఇదీ వరస. ఈ వీకెండ్లో రిలీజైన ‘రంగ రంగ వైభవంగా’, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రాలకు కూడా పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. వచ్చే వారం ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ చిత్రం రిలీజవుతుండడంతో ఈ వారం హిందీలో కొత్త రిలీజ్‌లే లేవసలు.
దీంతో ‘కార్తికేయ-2’ ఈ వారం కూడా ఇటు తెలుగులో, అటు హిందీలో బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. ఇండియాలో దూకుడు ఇలా ఉంటే.. యుఎస్‌లో కూడా నాలుగో వారంలో ఆ సినిమా చూపిస్తున్న జోరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. శనివారం యుఎస్‌లో నేషనల్ సినిమా డే జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని టికెట్ ధరలను 3 డాలర్లకు తగ్గించారు. దీంతో ‘కార్తికేయ-2’ చూడడానికి జనం ఎగబడుతున్నారు.
అక్కడ పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతుండడం.. కొత్త షోలు యాడ్ చేస్తుండడం విశేషం. ‘కార్తికేయ-2’ లాంటి చిన్న సినిమాకు నాలుగో వీకెండ్లో యుఎస్‌లో షోలు సోల్డ్ ఔట్ అయిపోవడం అంటే మామూలు విషయం కాదు. యుఎస్‌లో ఈ చిత్రం చాలా ముందే మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఫుల్ రన్లో ఇది 2 మిలియన్ మార్కుకు చేరువగా వెళ్లేలా కనిపిస్తోంది. ఇక ‘కార్తికేయ-2’ వరల్డ్ వైడ్ ఓవరాల్ గ్రాస్ వసూళ్లు 100 కోట్ల మార్కును దాటేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 3, 2022 2:33 pm
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…