పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ గా వేసిన జల్సా రీ రిలీజ్ కొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 పైగా షోలతో నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితం వచ్చిన పోకిరిని ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేరనుకుంటే జల్సా దాన్ని దాటేసి రాబోయే ఓల్డ్ క్లాసిక్స్ కి కొత్త సవాలు విసిరింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పవర్ స్టార్ అరాచకం మాములుగా లేదు. ముందు ఒకటి రెండు ఆటలకు పరిమితం చేద్దామనుకున్న ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో పూటకోసారి షోలు పెంచుకుంటూ పోయారు.
ఇక ప్రసాద్ ఐమ్యాక్స్ లోపల బయట జరిగిన రభస గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త సినిమాలు రంగరంగ వైభవంగా, కోబ్రా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జి ఇలారా టికెట్లు ఈజీగా దొరుకుతుండగా జల్సాను మాత్రం కొన్ని చోట్ల బ్లాక్ లో అమ్మారంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఫైనల్ గా ఎంత గ్రాస్ ఎంతొస్తుందనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. ఎంతలేదన్నా రెండు కోట్ల మార్కుని ఈజీగా దాటే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. థియేటర్లలో చేసిన సందడి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యాయి.
అయితే ఈ షోలకు సంబంధించిన నెగటివ్ యాంగిల్ లేకపోలేదు. కొన్ని చోట్ల అభిమానుల అత్యుత్సాహం వల్ల థియేటర్ ఆస్తులకు నష్టం కలిగింది. కర్నూలు శ్రీరామలో సౌండ్ సిస్టమ్ వల్ల ఇబ్బంది కలిగి షోలు క్యాన్సిల్ చేస్తే అద్దాలు పగలగొట్టి నానా రచ్చ చేశారు. విశాఖ లీలామహల్ హాల్లో సీట్లు ధ్వంసం చేసి స్క్రీన్ కి డ్యామేజ్ కలిగించారు. చేసేది కొందరే అయినా చెడ్డపేరు మాత్రం అందరికీ వచ్చేలా ఉంది. మొత్తానికి జల్సా ఇలా అన్ని రకాలుగా సెన్సేషనే అయ్యింది. 14 ఏళ్ళ తర్వాత యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఇంతగా తపించిపోయారంటే జల్సా మేనియా మామూలుది కాదనే విషయం అర్థమైపోయిందిగా.
This post was last modified on September 2, 2022 9:20 pm
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…