చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ లేకపోయినా ప్రమోషన్ల హడావిడితో జనాల దృష్టిని ఆకట్టుకున్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. మొన్నటిదాకా సోసోగా ఉన్న బజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడంతో అంతో ఇంతో పెరిగింది. దానికి తోడు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ రచనలో రూపొందిన ఎంటర్ టైనర్ గా బాగా పబ్లిసిటీ ఇచ్చారు.
ఒకపక్క పవన్ కళ్యాణ్ బర్త్ డే సంబరాలు జరుగుతుండగా మరోవైపు ఖుషి సినిమా మొదటి రోజు టికెట్లు సంపాదించడమనే పాయింట్ చుట్టూ రాసుకున్న ఈ బొమ్మ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కాసిన్ని అంచనాలు పెరిగాయి. హంగామా ఎంత చేసినా షార్ట్ ఫిలింకి సరిపోయే చిన్న పాయింట్ ని పట్టుకుని రెండు గంటల ఫుల్ లెన్త్ సిల్వర్ స్క్రీన్ డ్రామాగా మలచడంలో దర్శకులు వంశీధర్ – లక్ష్మినారాయణలు తడబడ్డారు. అటు నవ్వించలేక ఇటు ఎమోషనల్ గా మెప్పించలేక ఫస్ట్ డే ఫస్ట్ షో నిరాశ కలిగించింది.
ప్రేమించిన అమ్మాయి ఖుషి బెనిఫిట్ షో టికెట్ సంపాదించుకు రమ్మని చెప్పే పాయింట్ వినడానికి బాగానే ఉన్నా కేవలం దాని చుట్టే ఇంతేసి డ్రామాను నడిపించడంతో సిల్లీగా మారిపోయింది. దీనికి ఉపకథలు ఏవైనా జోడించి ఆ టికెట్ వ్యవహారాన్ని బ్యాక్ గ్రౌండ్ లో నడిపించినా కొంత ఫలితం ఉండేది కానీ అలా జరగలేదు. లీడ్ పెయిర్ శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసులతో పాటు సీనియర్ క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్ పరంగా ఎవరికి వారు బాగానే చేసినప్పటికీ వీక్ రైటింగ్ వల్ల తేలిపోయింది.
జాతిరత్నాలుని కేవలం జోకులు హిట్ చేయలేదు. ఓ క్రైమ్ ఎలిమెంట్ ని తగిలించి దాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పిన విధానం పేలింది. కానీ ఈ ఫస్ట్ డే ఫస్ట్ షోలో అలాంటి మెరుపులేమీ లేవు. అక్కడక్కడా రెండు మూడు జోకులు నవ్వించినా ఓవరాల్ గా బోర్ కొట్టించే స్క్రీన్ ప్లేతో ఈ సినిమాకి ఈవెనింగ్ షోకే జనాలు రాకుండా చేశారు. హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ కే నచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే ఇక వేరే హీరోల అభిమానుల గురించి చెప్పేదేముంది.
This post was last modified on September 2, 2022 5:58 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…