Movie News

‘భీమ్లా నాయక్‌’కు లైన్ క్లియర్

ఈ ఏడాది కొవిడ్ మూడో వేవ్ ప్రభావంతో డల్ అయిన బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపు తెచ్చిన సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. ఈ ఏడాది విడుదలైన తొలి భారీ చిత్రం అదే కావడం, మంచి టాక్ రావడంతో దాన్ని బాగానే ఆదరించారు జనం. కాకపోతే ఫిబ్రవరిలో అన్ సీజన్లో రిలీజ్ కావడం, ఏపీలో టికెట్ల ధరలు మరీ తక్కువ ఉండడంతో ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయినా సరే.. ఆ చిత్రాన్ని హిట్ మూవీగానే పరిగణించాలి.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటే హిందీలోనూ రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రణాళికలు రచించింది. హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది. కానీ తెలుగుతో పాటే అది విడుదల కాలేదు. తెలుగు రిలీజ్ హడావుడిలో పడి హిందీ వెర్షన్‌ను అనుకున్నట్లు రిలీజ్ చేయలేకపోయారేమో అనుకున్నారు. తర్వాత రెండు వారాల గ్యాప్‌లో హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీనికి వేరే కారణముంది.

‘భీమ్లా నాయక్’ మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషియుం’కు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. దీని హిందీ రీమేక్ హక్కులను జాన్ అబ్రహాంకు చెందిన సంస్థ సొంతం చేసుకుంది. ఐతే హిందీలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడంలో ఆలస్యం జరుగుతోంది. ఈలోపే తెలుగులో ‘భీమ్లా నాయక్’ చకచకా పూర్తయి విడుదలైపోయింది. ఆ సినిమాను హిందీలో రిలీజ్ చేయబోతుంటే తమకు ఇబ్బంది అవుతుందని జాన్ అబ్రహాం సంస్థ కోర్టుకెళ్లింది. ఈ కేసు చాన్నాళ్లు నలిగి చివరికి ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు సమాచారం.

‘భీమ్లా నాయక్’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను వాళ్లు రిలీజ్ చేసుకోవడానికి లైన్ క్లియరైంది. ఒకప్పుడైతే ఇలా ఓ తెలుగు సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే బాలీవుడ్ వాళ్లు పట్టించుకునేవారు కాదు కానీ.. ఈ మధ్య మన సినిమాలు అక్కడ ఇరగాడేస్తుండడంతో తాము తీయబోయే రీమేక్ వెర్షన్‌కు ‘భీమ్లా నాయక్’ గండి కొడుతుందని భయపడ్డట్లున్నారు. ఐతే ఎంత ప్రయత్నించినప్పటికీ ‘భీమ్లానాయక్’ హిందీ వెర్షన్‌ రిలీజ్‌ను అడ్డుకోలేకపోతున్నారు. కానీ ఇంత ఆలస్యంగా రిలీజవుతున్న ‘భీమ్లానాయక్’ హిందీ వెర్షన్ ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నదే సందేహం.

This post was last modified on September 1, 2022 7:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago