ఆర్ఆర్ఆర్ సందడి ముగిసిపోయి నెలలు గడుస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాకపోవడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఆచార్య ఫలితంతో సంబంధం లేకుండా కొరటాల శివతో కొనసాగాలని తారక్ డిసైడ్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సెమి లుక్ పోస్టర్ లాంటిది వదిలి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇది యంగ్ టైగర్ బర్త్ డే నాటి ముచ్చట. ఆపై సౌండ్ లేదు. మరోవైపు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తన గురువు సహకారంతో కొత్త స్క్రిప్ట్ ని చెక్కే పనిలో యమా బిజీగా ఉంటూ అప్పుడప్పుడు ఫోటోలు కూడా పెడుతున్నాడు.
దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని ఎప్పుడో లీక్ వచ్చింది. ఇందులో తారక్ తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తాడని, ఒక పాత్ర వీల్ చైర్ కు అతుక్కుపోయిన అరవై ఏళ్ళ వయసులో ఉంటే, మరో క్యారెక్టర్ యువకుడైన కబడ్డీ ప్లేయర్ గా ఉంటుందట. ఈ రెండు రోల్స్ ని ప్రెజెంట్ చేసే తీరు, ఎమోషన్స్ రాబట్టే విధానం ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. రంగస్థలం, పుష్ప హీరోల క్యారెక్టరైజేషన్స్ ని కంబైన్ చేసి ఎప్పుడూ చూడని సరికొత్త ఫ్లేవర్ తో ప్రెజెంట్ చేస్తారని వినికిడి.
ఇలా ఫాదర్ అండ్ సన్ గా జూనియర్ కనిపించింది 2004లో వచ్చిన ఆంధ్రావాలాలోనే. అదెంత చేదు అనుభవమో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. కాకపోతే అప్పటికి ఇప్పటికి వయసులో చాలా వ్యత్యాసం వచ్చేసింది కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు. ఇది నిజమో కాదో కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ కి కొంత ఉత్సాహం వచ్చేలా అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటే మంచిది. ప్రశాంత్ నీల్ సైతం తన సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ని చెప్పాడు కానీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆ మాటకే కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేదు. సో అన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on September 1, 2022 8:14 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…