Movie News

మెగా కుర్రాడికి భలే ఛాన్సులే

2022 ఆగస్టు నెల టాలీవుడ్‌కు చిరస్మరణీయం అనే చెప్పాలి. ఈ నెలలో రెండు వారాల వ్యవధిలో మూడు భారీ విజయాలు టాలీవుడ్ సొంతం అయ్యాయి. నెలాఖర్లో వచ్చిన ‘లైగర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. సినిమాకు ఏమాత్రం మంచి టాక్ వచ్చినా కథ వేరుగా ఉండేది. 2022 ఆగస్టు ఇంకా స్పెషల్ అయ్యుండేది. ‘లైగర్’ నిరాశ పరిచినప్పటికీ ఈ నెలను టాలీవుడ్ మరిచిపోలేదు. ఇప్పుడిక అందరి దృష్టి సెప్టెంబరు మీదికి మళ్లుతోంది.

‘లైగర్’ తేడా కొట్టడంతో పాత చిత్రాలైన కార్తికేయ-2, సీతారామం, బింబిసారనే ఇంకా బాక్సాఫీస్‌ను ఏలుతున్నాయి. 3-4 వారాల్లో కూడా అవి మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఐతే ఇవి ఎంత బాగా ఆడుతున్నప్పటికీ.. కొత్త చిత్రాలు వచ్చాయంటే ప్రేక్షకుల దృష్టి అటు వైపు మళ్లుతుంది. వాటిలో తమకు కనెక్ట్ అయ్యే సినిమా ఉంటే, దానికి మంచి టాక్ వస్తే ఆదరిస్తారు. అందులోనూ ‘లైగర్’ బాగా డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో ఇంకో మంచి సినిమా చూడాలని అనుకుంటారు.

ఈ సిచువేషన్ మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్‌కు కలిసొచ్చేదే. అతడి కొత్త చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటుగా అరడజను సినిమాల దాకా రిలీజవుతున్నాయి. మిగతా తెలుగు చిత్రాలతో పోలిస్తే తమిళ అనువాదం ‘కోబ్రా’తోనే వైష్ణవ్ సినిమాకు పోటీ ఉండొచ్చు. కాకపోతే అది బుధవారం వినాయక చవితి రోజే రిలీజైపోతోంది. దాని సందడి రెండు రోజులే ఉండొచ్చు. ఆ చిత్రం మీద తెలుగు ప్రేక్షకుల్లో మరీ అంచనాలైతే లేవు.

సినిమా ఆహా ఓహో అంటే తప్ప ఆడే అవకాశాలు తక్కు. ఈ వారానికి ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది, ముఖ్యంగా యూత్‌లో బజ్ ఉన్నది ‘రంగ రంగ వైభవంగా’కే. కాబట్టి సినిమాకు మంచి టాక్ వస్తే.. ఆగస్టు సినిమాల మాదిరే ఇది కూడా థియేటర్లను కళకళలాడించడం, పెద్ద హిట్‌గా నిలవడం ఖాయం. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్‌తో దర్శకుడిగా పరిచయం అయిన గిరీశయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కేతిక శర్మ కథానాయికగా నటించింది.

This post was last modified on August 29, 2022 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్జున్ రెడ్డికి మొదటి ఛాయస్ సాయిపల్లవి : సందీప్ వంగా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…

6 hours ago

పెద్దిరెడ్ది అయినా!… పిచ్చిరెడ్డి అయినా!

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…

6 hours ago

ఇంత జాలీగా వీరు ఎప్పుడూ కనిపించలేదు

ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…

8 hours ago

నాని పట్టుదల – అనిరుధ్ చేతికి ప్యారడైజ్

దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…

10 hours ago

కోటి తీసుకుంటే.. సూటుతోనే రావాలా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…

11 hours ago

స్పిరిట్ తర్వాత సందీప్ వంగా హీరో ఎవరు

యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…

12 hours ago