టాలీవుడ్లో సూపర్ స్టార్లు చాలామంది ఉన్నారు. టాప్ స్టార్లలో ఈ హీరోకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, ఆ హీరోకు తక్కువ అని పోలిక పెట్టి చూడడం కరెక్ట్ కాదు. కానీ క్రేజ్ అనే మాట వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అతడి క్రేజ్ విస్తరించిన తీరు అసాధారణమైంది. పదేళ్లు సరైన విజయాలు లేకపోయినా.. ఆ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ‘గబ్బర్ సింగ్’తో తిరిగి ఫాం అందుకోగానే పవన్ మీద అభిమానం ఏ స్థాయిలో ఉవ్వెత్తున ఎగసిందో తెలిసిందే.
చాలా ఏళ్ల నుంచి పవన్ అభిమానులు కోరుకునే సినిమాలు చేయకపోయినా, కొంత కాలం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నా.. ఇప్పుడు రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నా ఆయన క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఓవైపు ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల పట్ల తీవ్ర సందిగ్ధత నడుస్తున్నప్పటికీ.. సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండేలా లేదు.
ఈ నెలలో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వరల్డ్ వైడ్ భారీగా ‘పోకిరి’ స్పెషల్ షోలతో హోరెత్తించారు. షోలు, వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పారు. ఇప్పుడు పవన్ అభిమానుల వంతు వచ్చింది. ‘పోకిరి’నే టార్గెట్‌గా షోలు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కెరీర్లో తిరుగులేని ఫ్యాన్ మూమెంట్స్ ఉన్న సినిమాగా చెప్పుకునే ‘జల్సా’ సినిమాకు సంబంధించి ఎంతో కష్టపడి ప్రింట్‌ను రీమాస్టర్ చేయించి స్పెషల్ షోలకు రంగం సిద్ధం చేశారు.
ఆ షోలకు టికెట్లు ఇలా పెట్టగానే అలా అమ్ముడవుతున్నాయి. ఇక ‘జల్సా’ గురించి అందరూ మాట్లాడుకుంటుంటే.. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో చడీచప్పుడు లేకుండా ‘తమ్ముడు’ స్పెషల్ షోలకు బుకింగ్స్ ఓపెన్ చేశారు. పవన్ పుట్టిన రోజు కంటే రెండు రోజుల ముందు ఏవో రెండు షోలు వేద్దామని టికెట్లు పెడితే.. అవి హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆ రెస్పాన్స్ చూసి షోలు పెంచుకుంటూ పోగా.. అవి 13కు చేరుకున్నాయి. అందులో లార్జ్ స్క్రీన్లోనూ షో వేసేశారు. అన్ని షోలూ సోల్డ్ ఔట్ దశలో ఉన్నాయి. ఇది చూసి హైదరాబాద్‌లో మరిన్ని థియేటర్లు చవితి రోజు ‘తమ్ముడు’ స్పెషల్ షోలు పెట్టగా.. వాటికీ రెస్పాన్స్ అదిరిపోతోంది. ఇదంతా చూసి పవన్ కళ్యాణ్.. క్రేజ్ కా బాప్ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on August 28, 2022 6:48 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…