ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్టయినా సరే.. పూరి జగన్నాథ్ ఫామ్ మీద చాలామందికి సందేహాలు తొలగిపోలేదు. అంతకుముందు ఆయన అలాంటి డిజాస్టర్లు ఇచ్చాడు మరి. అందుకే విజయ్ దేవరకొండ.. పూరితో సినిమా చేస్తుంటే అతడి అభిమానుల్లో చాలామంది వద్దే వద్దన్నారు. కానీ విజయ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా లైగర్ కథ నచ్చేసి, పూరి పనితనం మీద నమ్మకంతో సినిమా చేశాడు.
ఇప్పటిదాకా కెరీర్లో ఏ సినిమాకూ పడనంత కష్టం పడ్డాడు. అత్యధిక సమయమూ వెచ్చించాడు. చివరికి చూస్తే అతడి కష్టమంతా వృథా అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సినిమా కోసమా ఇంత కష్టం, అంత సమయం పెట్టావు, పూరీతో సినిమా వద్దంటే విన్నావా అంటూ అభిమానులు ఇప్పుడు విజయ్‌ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. వీళ్ల పరిప్థితి ఇలా ఉంటే.. పామ్ కోల్పోయిన దర్శకులను నమ్మి సినిమాలు చేస్తున్న తమ హీరోల విషయంలో వేరే అభిమానుల్లో ఇప్పుడు కంగారు మొదలైంది.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల టెన్షన్ మామూలుగా లేదు. ఆయన లైనప్ విషయంలో ఇప్పటికే వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక పూరి పనితనం చూశాక మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ చిరును ఒక రీమేక్ మూవీలో ఎలా ప్రెజెంట్ చేస్తాడో, తమకు ఎలాంటి అనుభవం మిగిలుస్తాడో అన్న భయం వారిని వెంటాడుతోంది. శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసిన మెహర్‌తో సినిమా వద్దని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే మొత్తుకున్నారు. ఆ మాటకొస్తే కె.ఎస్.రవీంద్ర (బాబీ)తో సినిమా విషయంలోనూ వారి వేదన అలాగే ఉంది.
అతడి ఫాం కూడా ఏమీ బాగా లేదు. జై లవకుశతో కాస్త పర్వాలేదనిపించాడు కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీమామ చిత్రాలతో అతను నిరాశపరిచాడు. అతడి కథలన్నీ ఔట్‌డేటెడ్ అనిపిస్తాయి. మరోవైపు ప్రభాస్‌కు ఇప్పుడు తగిలిన దెబ్బలు చాలవని మారుతితో జట్టు కట్టడంపై అభిమానుల్లో అసంతృప్తి మామూలుగా లేదు. దీనికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఉద్యమమే చేస్తున్నారు ఫ్యాన్స్. అయినా ప్రభాస్ వెనక్కి తగ్గలేదు. పూరి అనుభవం చూశాక ఈ దర్శకులందరి విషయంలోనూ ఆయా హీరోల అభిమానులకు టెన్షన్ తప్పట్లేదు.
This post was last modified on August 28, 2022 4:24 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…