హరీష్ శంకర్ చాలా కాన్ఫిడెంట్‌గా, అగ్రెసివ్‌గా కనిపించే దర్శకుడు. పెద్ద డిజాస్టర్ తీసినా కూడా జావగారిపోకుండా స్థిమితంగా ఉండే రకం. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏవైనా ఎదురైనా దీటుగా ఎదుర్కొంటాడు. అలాంటి దర్శకుడిని చూసి పాపం అని జాలిపడడం కొంచెం చిత్రంగానే ఉంటుంది. కానీ హరీష్ పరిస్థితి చూస్తే అలాగే ఉంది మరి. ఈ రోజుల్లో ఒక హిట్ కొట్టాక దర్శకులు అస్సలు ఖాళీ ఉండరు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. డిమాండ్ ఉండగానే వీలైనన్ని సినిమాలు చేసేయాలని చూస్తారు. మళ్లీ ఇంకో ఫ్లాప్ పడితే సినీ జనాలు పట్టించుకోరు కాబట్టి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే చూస్తారు. కానీ ‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్టు తర్వాత హరీష్ శంకర్ మూడేళ్లకు పైగా సినిమా చేయకుండా ఖాళీగా ఉండాల్సి రావడం విచారకరం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం దక్కించుకోవడం వరమో, శాపమో అర్థం కాని స్థితిలో ఉన్నాడతను.
రెండేళ్ల ముందే స్క్రిప్టు రెడీ చేసుకుని పవన్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాడు హరీష్. ఇదిగో అదిగో అనుకుంటూనే ఆ సినిమా వెనక్కి వెళ్తూనే ఉంది. ఇటు సోషల్ మీడియాలో, అటు పబ్లిక్ ఈవెంట్లలో హరీష్‌ను పవన్ సినిమా గురించి అభిమానులు అడగడం.. తమ డిమాండ్లను ఏకరవు పెట్టడం.. వాటికి హరీష్ ఓపిగ్గా బదులివ్వడం, లేదంటే వాళ్లు మురిసిపోయే మాటలు చెప్పడం మామూలైపోయింది. కానీ ఈ కబుర్లను దాటి సినిమా కార్యరూపం మాత్రం దాల్చట్లేదు.
తాజాగా పవన్ వింటేజ్ స్టైల్, డ్యాన్సులతో కూడిన ఒక వీడియో మీద కామెంట్ చేస్తూ ఓ అభిమాని.. ఇలా మళ్లీ పవన్‌ను చూపించగల దర్శకుడు మీరే అంటూ హరీష్‌ను ట్యాగ్ చేశాడు. దానికి హరీష్ బదులిస్తూ.. మన సినిమాలో ఇంతకు మించే ఉంటుంది, సినిమా ఆలస్యం అయినా అంచనాలకు తగ్గదు అని బదులిచ్చాడు. పవన్ ఎంతకీ డేట్లు ఇవ్వకున్నా, సినిమా పట్టాలెక్కకపోయినా వేరే సినిమా గురించి ఆలోచించకుండా అతడి కోసం నిరీక్షిస్తూ ఉండడం హరీష్ కమిట్మెంట్‌ను తెలియజేస్తుంది. కానీ దీని వల్ల విలువైన సమయం వృథా అయిపోతుండటం, ఆదాయం కోల్పోతుండడం చూసి హరీష్ శంకర్‌పై నెటిజన్లు జాలిపడుతున్నారు.
This post was last modified on August 27, 2022 10:48 pm
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…