కొవిడ్ పుణ్యమా అని ఇండియాలో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. తెలుగులో కూడా ఓటీటీల జోరు మామూలుగా లేదు. ఐతే ఇవి ఫిలిం ఇండస్ట్రీకి మేలు చేశాయా, చెడు చేశాయా అంటే చెప్పడం కష్టమే. కరోనా టైంలో థియేటర్లు మూతపడగా, ఓటీటీలో కొత్త సినిమాలను కొని రిలీజ్ చేశాయి. ఆ రకంగా నిర్మాతలకు ఆదాయాన్ని అందించాయి. ప్రేక్షకులకు కూడా వినోదానికి ఢోకా లేకపోయింది. కానీ ఆడియన్స్ వాటికి బాగా అలవాటు పడిపోయి థియేటర్లకు రావడం తగ్గించేయడంతో నిర్మాతల ప్రధాన ఆదాయ వనరు మీద ప్రతికూల ప్రభావం పడింది.
కొత్త సినిమాలను నేరుగా, లేదంటే థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడం మున్ముందు ఇండస్ట్రీని మరింత ప్రమాదంలోకి నెడుతుందనే చర్చ ఇటీవల బాగా నడిచింది. ఈ నేపథ్యంలోనే కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే తీర్మానం జరిగింది టాలీవుడ్లో.
ఐతే అంత ఆలస్యం చేస్తే ఓటీటీలు డిజిటల్ హక్కుల విషయంలో కచ్చితంగా రేటు తగ్గిస్తాయనే అంచనా ముందు నుంచే ఉంది. ఈ విషయంలో ఓటీటీలన్నీ కలిపి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమాకు ఇంత రేటు అని కాకుండా అది స్ట్రీమ్ అయ్యే సమయాన్ని బట్టి ధర చెల్లించాలని నిర్ణయిచాయట. ఒక గంట స్ట్రీమింగ్ సమయానికి 3 రూపాయలు చెల్లిస్తారట. ఇలా ఎన్ని గంటల సమయం స్ట్రీమ్ అయితే అన్ని 3 రూపాయలు జమ అవుతుంది.
10 లక్షల మంది రెండు గంటల సినిమాను పూర్తిగా చూస్తే రూ.60 లక్షలు చెల్లిస్తారన్నమాట. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఈ మేరకు రేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలకు ఇలా కాకుండా సినిమాకు ఇంత అనే రేటు ఇవ్వొచ్చు. కానీ థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు గ్యాప్ ఎక్కువ ఉంటోంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చే ధరలైతే ఉండవు. కచ్చితంగా రేటు తగ్గుతుంది. ఇది కచ్చితంగా టాలీవుడ్‌కు షాకే. మరి నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on August 27, 2022 5:50 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…