ఓవైపు సౌత్ సినిమాలు ఉత్తరాదిని ఊపేస్తుంటే.. మరోవైపు బాలీవుడ్ సినిమాలు నార్త్‌లో కూడా ప్రభావం చూపలేకపోతున్నాయి. అక్కడ రోజు రోజుకూ గ్రౌండ్ కోల్పోతున్న బాలీవుడ్ సినిమాలు.. దక్షిణాదిన పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అస్సలు ఫలితాన్నివ్వడం లేదు. ఇటీవలే ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ను దక్షిణాది భాషల్లో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయగా.. దాన్ని ఇక్కడి జనాలు అస్సలు పట్టంచుకోలేదు. ‘షంషేరా’ అనే సినిమా డబ్బింగ్ వెర్షన్ల పరిస్థితి కూడా ఇంతే.
ఐతే ఈ రెండు చిత్రాలతో పోలిస్తే ‘బ్రహ్మాస్త్ర’ను దక్షిణాదిన చాలా గట్టిగా ప్రమోట్ చేస్తోంది చిత్ర బృందం. తెలుగులో ఇప్పటికే వైజాగ్‌లో ఒక ఈవెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండడం, రాజమౌళి చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాకు క్రేజ్ పెంచుతుందని ఆశించారు కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.
ఇప్పటిదాకా అయితే ‘బ్రహ్మాస్త్ర’కు తెలుగులో అనుకున్నంత బజ్ క్రియేటవ్వలేదు. దీంతో ఇప్పుడిక ప్రచార పరంగా బ్రహ్మాస్త్రాన్ని వదలడానికి సిద్ధమైంది చిత్ర బృందం. హైదరాబాద్‌లో జరిగే ‘బ్రహ్మాస్త్ర’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ముఖ్య అతిథిగా రప్పిస్తున్నారు. ఇక్కడి తెలుగు సినిమాలకు చేసిన స్థాయిలో ఈవెంట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ముందు ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలవాలని అనుకున్నారు కానీ.. ఈ మధ్య ఆయన ప్రమోట్ చేసిన చిత్రాలకు ప్రతికూల ఫలితాలు రావడంతో ఆయనే కొన్నాళ్ల పాటు ఇలాంటి ఈవెంట్లకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారట.
ఇక ఇటీవలే ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ అతిథిగా వచ్చి దానికి ఎలివేషన్ ఇవ్వగా.. సినిమా ఘనవిజయం సాధించడంతో ఇప్పుడతను పాజిటివ్ సెంటిమెంట్‌గా మారాడు. అందుకే తారక్‌ను ప్రచార పరంగా బ్రహ్మాస్త్రంలా వాడుకోవాలని ‘బ్రహ్మాస్త్ర’ టీం ఫిక్సయినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 27, 2022 2:00 pm
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…