భారీ అంచనాలతో విజయ్ దేవరకొండ మొదటి ప్యాన్ ఇండియా మూవీగా పబ్లిసిటీ చేసుకున్న లైగర్ కు అనూహ్యంగా నెగటివ్ టాక్ రావడం ఫ్యాన్స్ ని షాక్ లో పడేసింది. వాళ్ళు సైతం కంటెంట్ మరీ అంత తీసికట్టుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం యావరేజ్ అనే మాట వచ్చినా ఓ రెండు మూడు రోజులు వీకెండ్ ఎఫెక్ట్ తో మంచి పుష్ దక్కేది.
కానీ సోషల్ మీడియాలో నెటిజెన్లు లైగర్ మీద మాములుగా విరుచుకు పడటం లేదు. పూరి నుంచి ఇలాంటి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయలేదని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. దీని సంగతలా ఉంచితే లైగర్ టీమ్ ముందు నుంచి హై లైట్ చేసుకుంటూ వచ్చిన అంశం బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పాత్ర.
ఇదేదో బ్లాస్టింగ్ రేంజ్ లో ఉంటుందనుకుంటే కామెడీకి యాక్షన్ కు మధ్యలో నలిగిపోయి ఎటూకాకుండా నిరాశపరిచింది. నిజానికి మైక్ గురించి ఇప్పటి జెనరేషన్ కి అంత అవగాహన లేదు. పైగా నిన్నటి తరానికి చెందిన వృద్ధ లెజెండ్. అందులోనూ ఈ క్రీడకు మన దేశంలో ఆదరణ తక్కువ. అలాంటప్పుడు మైక్ టైసన్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉన్నా తెలుగు ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యే సీన్ ఉండదు. ఇప్పుడదే మైనస్ అయ్యింది.
దీనికి తోడు ఈ ఎపిసోడ్ సరిగా రాసుకోకపోవడంతో పూర్తిగా థ్రిల్ మిస్ అయ్యింది. రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో విషయం ఎంత డిజాస్టర్ ఉన్నా కనీసం చిరంజీవి వచ్చే ఆ పది నిముషాలు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఆ రేంజ్ లో మైక్ పార్ట్ ని ఊహించుకుంటే ఇలా ఉసూరుమనిపించేశారు. లైగర్ కి సీక్వెల్ ఉంటుందని ఏదో హైప్ కోసం ఇంటర్వ్యూలో చెప్పారు కానీ ఇప్పుడీ రెస్పాన్స్ చూస్తే దీనికి బ్రేక్ ఈవెన్ అయితే చాలానే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద వీకెండ్ తో వచ్చింది కాబట్టి లైగర్ దాన్నేమాత్రం వాడుకుంటాడో చూడాలి
This post was last modified on August 27, 2022 6:09 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…