Movie News

నాని కూడా వేసేశాడు కర్చీఫ్

ఈ రోజుల్లో రిలీజ్ డేట్ విషయంలో చాలా అడ్వాన్స్‌గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. సినిమాల మేకింగ్ ఎక్కువైపోయి, పోటీ పెరిగిపోవడంతో బాలీవుడ్ స్టయిల్లో చాలా ముందుగానే డేట్లు ప్రకటించేస్తున్నారు. తర్వాత దానికి కట్టుబడతారా లేదా అన్నది సందేహమే కానీ.. ముందైతే ఎందుకైనా మంచిదని కర్చీఫ్ వేసి పెట్టేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఇంకా చాలా టైం ఉండగానే ఒకదాని తర్వాత ఒక సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు.

ఇంకా సెట్స్ మీదికే వెళ్లని మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు 2023 ఏప్రిల్ 28న విడుదల ఖరారు చేయడం తెలిసిందే. అలాగే షూటింగ్ ఆరంభ దశలోనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’కు సైతం డేట్ ఖరారైంది. ఆ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు వేసవి రేసులోకి ఇంకో సినిమా వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘దసరా’ను మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం ‘దసరా’. ఇందులో నాని ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ను గుర్తుకు తెచ్చేలా డీగ్లామరస్, రగ్డ్‌ లుక్‌లో కనిపించనున్నాడు. నాని ఇంత డీగ్లామరస్‌లో రోల్‌లో ఇంత వరకు నటించింది లేదు. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ సింగరేణి గనుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మూణ్నాలుగు దశాబ్దాల కిందటి కాలంలో నడిచే కథ ఇది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా లాంచ్ చేసిన పోస్టర్లో నాని వెనుక సిల్క్ స్మిత బొమ్మ కనిపించింది.

దీన్ని బట్టే ఇది ఆ కాలం నాటి సినిమా అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటిదాకా ఆమె లుక్‌ను రిలీజ్ చేయలేదు. ఆమెది కూడా డీగ్లామరస్ రోలే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పడి పడి లేచె మనసు, విరాటపర్వం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ లాంటి చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న సుధాకర్ చెరుకూరి ‘దసరా’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

This post was last modified on August 26, 2022 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

3 hours ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

9 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

10 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

11 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

12 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

12 hours ago