Movie News

‘అతి’ ఫార్ములా.. డేంజరస్

గత ఏడాది ‘పాగల్’ అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మామూలుగా ఉండదని, దీని దెబ్బకు మూసుకున్న థియేటర్లు కూడా తెరుచుకుంటాయని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. తొలి రోజు థియేటర్ల కొంచెం సందడి కనిపించింది. కానీ తెర మీద బొమ్మ చూసిన వారికి దిమ్మతిరిగిపోయింది. ఈ సినిమా గురించా ఇంత ఎలివేషన్ ఇచ్చాడు అంటూ అతన్ని ట్రోల్ చేశారు జనం.

దీని గురించి తర్వాత విశ్వక్‌ను అడిగితే మరి జనాల్ని ఎలాగోలా థియేటర్లకు రప్పించాలి కదా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఐతే ఆ సమయానికి ఓపెనింగ్స్ కోసమని ఇలాంటి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి తాత్కాలిక ప్రయోజనం పొందడం బాగానే ఉంటుంది కానీ.. దీని వల్ల దెబ్బ తినే క్రెడిబిలిటీ సంగతేంటన్నది చూడాలి. ఇలా ఇంకో రెండు స్టేట్మెంట్లు ఇస్తే ప్రేక్షకుల్లో నమ్మకం పోతుంది. ఆవు-పులి కథలా తయారయ్యి రేప్పొద్దున మంచి సినిమా తీసి దాని గురించి ఎలివేషన్ ఇచ్చినా కూడా చూడ్డానికి ఆసక్తి చూపించకపోవచ్చు.

సరిగ్గా విజయ్ దేవరకొండ కూడా ఇదే రూట్లో పయనిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తన సినిమాల గురించి అతను మామూలు ఎలివేషన్లు ఇవ్వడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా ప్రతి డిజాస్టర్ గురించీ ఒక రేంజిలో చెప్పాడు. అవి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయన్నాడు. ఆ స్టేట్మెంట్ల వల్ల హైప్ వచ్చింది. ఆ చిత్రాలు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. కానీ విజయ్ మాటల వల్ల అంచనాలు పెరిగిపోగా.. అందుకు తగ్గట్లు సినిమాలు లేకపోవడంతో రెండో రోజు నుంచే థియేటర్లు వెలవెలబోయాయి.

అంతిమంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ‘లైగర్’ విషయంలో విజయ్ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఇది సాలిడ్ సినిమా అని.. ఇండియా షేక్ అయిపోతుందని.. ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి తన లెక్క రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని.. ఇలా అతడిచ్చిన స్టేట్మెంట్లన్నీ చాలా పెద్దవే. తీరా సినిమా చూస్తే హడావుడి తప్ప అందులో విషయం లేదు. ఇన్నాళ్ల సంగతేమో కానీ.. ‘లైగర్’తో అతను తన క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీసుకున్నాడన్నది వాస్తవం. ఇక విజయ్‌ను జనాలు నమ్మడం మానేస్తారేమో. రేప్పొద్దున ‘ఖుషి’ సినిమా బాగున్నా కూడా రావాల్సినంత హైప్ రాకపోతే అందుకు బాధ్యుడు విజయే అవుతాడు.

This post was last modified on August 26, 2022 12:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…

29 minutes ago

ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…

2 hours ago

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

6 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

6 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

8 hours ago