Movie News

‘జనగణమన’ పరిస్థితేంటి?

పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమాకు ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఓ మోస్తరుగా ఉన్నా సరే ఇరగాడేసేది. కానీ రొటీన్ కథాకథనాలతో సినిమాను పూరి నిస్సారంగా తయారు చేయడంతో ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. విడుదలకు ముందు సినిమాకు ఎంత బాగా హైప్ క్రియేట్ అయిందో.. ఇప్పుడు అంతే వేగంగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.

దీన్ని తట్టుకుని సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమా ఫలితమేంటో తెలియగానే అందరి దృష్టి పూరి-విజయ్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన మరో చిత్రం ‘జనగణమన’ మీదికి మళ్లింది. ఈ సినిమా భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అనౌన్స్‌మెంట్‌కు మాత్రమే పరిమితమై, షూటింగ్ ఏమీ చేయని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆపేసినా ఆశ్చర్యం లేదేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

‘జనగణమన’ చర్చ ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సినిమా గురించి చెబుతున్నాడు పూరి. మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలన్నది ఆయన ఉద్దేశం. కానీ పూరి ఫాం కోల్పోవడం వల్లో ఏమో అతను ఈ సినిమా చేయలేదు. ఇక అది అటకెక్కేసినట్లే అనుకున్నారు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ హిట్ కొట్టి విజయ్ దేవరకొండను ‘లైగర్’కు కమిట్ చేయించిన పూరి.. ఆ చిత్రం పూర్తవుతున్న దశలో ‘జనగణమన’కూ ఒప్పించాడు.

హడావుడిగా ఆ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా భారీ హంగామా మధ్య జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. ‘లైగర్’ రిలీజయ్యే లోపే ఈ సినిమా షూటింగ్ కూడా కొంత పూర్తి చేస్తారని అనుకున్నారు కానీ.. విజయ్ దీన్ని పక్కన పెట్టి ‘ఖుషి’ని పట్టాలెక్కించాడు. కొంత షూటింగ్ చేసేస్తే ఈ సినిమాను పూర్తి చేయక తప్పని స్థితిలో విజయ్ ఉండేవాడు. కానీ పూరి ఏ ఉద్దేశంతో ఈ సినిమాను హడావుడిగా ప్రకటించాడో కానీ, విజయ్ తెలివిగానే దాన్ని హోల్డ్ చేసి ‘ఖుషి’ని మొదలుపెట్టాడు.

ఇప్పుడు కట్ చేస్తే ‘లైగర్’కు డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో ‘జనగణమన’ మీద అనుమానాలు ముసురుకున్నాయి. ఇలాంటి ఫలితం తర్వాత పూరిని నమ్మి విజయ్ ‘జనగణమన’ చేయడం ఆత్మహత్యాసదృశ్యమే అన్న అభిప్రాయాలు అతడి అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి వినిపిస్తున్నాయి. మరి విజయ్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

This post was last modified on August 25, 2022 11:47 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

3 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

5 hours ago